నేటి భారతంలో స్త్రీ (కవిత). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం .

నేటి భారతంలో స్త్రీ (కవిత). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం .

🦜నేటి భారతంలో స్తీ🦜
______________________
నేటి భారతంలో సౌజన్యమూర్తి మన భారతీయ ఈ స్త్రీ మూర్తి
మేటి సహనశీలియై వర్ధిల్లు సహజమూర్తి మన శాంతిమూర్తి !

తాను పడుతున్న కష్టనష్టాలను తలుచుకుంటే కొలుచుకుంటే
ఎంతటి రాతి గుండె అయినా ద్రవించి నీరై ఏరులా పారుతుంది!

మళ్ళి మళ్ళి తాను తుళ్ళి తుళ్ళి
కార్చుటకు ఆ కన్నీరే కరువైచివరకు
ఆ కష్టాల కడలి తీరంకే చేరుతుంది 
ఇష్టాల నష్టాల భారం మారుతుంది

యశస్సు ఐశ్వర్యం మధుర వాక్కు
జ్ఞాపకశక్తి బుద్ధి దృఢత్వం ఓర్పు అను సప్తదివ్య సుగుణాల రాశి 
కుటుంబ భారం మోసే సాహసి!

అమ్మగాఅక్కగాచెల్లిగాఅర్దాంగిగా
బహుముఖ పాత్రలు పోషిస్తూ
మనందరి బ్రతుకుల్లొ అమృతం
కురిపిస్తుందిమనల మురిపిస్తుంది

నేటి భారతంలో స్త్రీ కష్టాలను గూర్చి వ్రాస్తే ఓ ఉద్గ్రంధం ఔతుంది
భారతం భాగవతం రామాయణం
కొన్ని మిన్నయై ఇల వెలుగుతుంది!

గృహాన్ని స్వర్గసీమ గా మారుస్తూ
కుటుంబ సభ్యులకు సహకరిస్తూ
జీవిస్తున్న భారతంలోని స్త్రీ మూర్తికి వందనం అభివందనం !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
నాగర్ కర్నూలు జిల్లా.
సెల్ నెంబర్.9491387977.

0/Post a Comment/Comments