గరీబీ..హటాఓ..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

గరీబీ..హటాఓ..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

గరీబీ..హటాఓ..!(కవిత)

ఎంత మంది అభాగ్యులు ఉన్నారో..ఈ లోకంలో..!??
ఎన్ని ఊర్లలో,
ఎన్ని రోడ్ల కూడళ్లలో దర్శనమిస్తున్నారో..!??
వందల ఏళ్ల నుంచి కూడ మార్పు రావట్లేదని అన్పిస్తోంది..!??
గరీబీ హటాఓ(బీదరికాన్ని దూరం చేయండి)నన్నవి కేవలం 
నినాదాలు గానే మిగిలి ఉన్నాయి..!?
నిజంగా మార్పు రావాలని పాలకులు కోరుకోలేదా..!? నన్న సంశయం 
రేకెత్తిస్తోంది..!
ఏమిటీ దుస్థితి..!?
నా బాల్యంలో విన్నాను..అమెరికా వోడు భారతీయులను 
ఇండియన్స్ ఆర్ బెగ్గర్స్ అంటాడని..!
కాని ఇప్పుడు ఆలోచిస్తే.. నలభై రెండు ఏళ్ళు కాదు కదా..
వెయ్యి సంవత్సరాలు దాటినా..
మన దేశం నుండి పేదరికం అన్నది మాయం కాదన్నది ఘంటాపథముగా చెప్పొచ్చు..!?
ఎందుకంటే 
మంచిమార్పును తీసుకొచ్చే ప్రభుత్వాలు-పాలనలు రావడం లేదు కదా..!???
స్వార్థ రాజకీయ నాయకులు వస్తున్నారు..పోతున్నారు..! అందుకే..
ఎక్కడ వేసిన గొంగళి 
అక్కడేనన్నట్లు, 
అయ్యింది పరిస్థితి..!??
సత్పరిణామాలు 
చోటుచేసుకుంటాయన్న నమ్మకమూ మిగిలిలేదు..!?
చూడడం తప్ప ఏమీ చేయలేని దుస్థితి..!???సగటు భారతీయుడి పరిస్థితి..!??

✍🏻 విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments