ఎక్కడి శాంతి లోకంలో..!(కవిత), ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

ఎక్కడి శాంతి లోకంలో..!(కవిత), ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

ఎక్కడి శాంతి లోకంలో..!(కవిత)

రణనీతి రాజ్యమేలుతున్న 
ప్రస్తుత కాలంలో.. 
"ప్రపంచ శాంతి" అన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది..!??
ప్రపంచ దేశాలు..ఆధిపత్య ధోరణి తో యుద్ధాలకు కదం తొక్కడం పైనే ఆసక్తి చూపుతున్నాయి..!?
మతాల.. విధ్వంసం,
సరిహద్దు.. సమస్యలు,
అంతర్జతీయంగా వ్యాపార,రవాణా ఆంక్షలు..
ఇత్యాది ఎన్నో కారణాలతో ప్రపంచ దేశాలు వివాదాలతో.. 
కయ్యానికి కాలు 
దువ్వుతూ..శాంతియుత వాతావరణం,జీవనం లేకుండా చేస్తున్నాయి..!??
అనంతంగా అమాయకులు ప్రాణాలు అర్పించిన అనంతరం గాని, శాంతి కావాలని కోరుకుంటున్నారు..!
ఐతే అమలు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నది..!
కేవలం శాంతి దినోత్సవాలు మాత్రమే మార్పు 
తీసుకొస్తాయని నమ్మలేం..!??
తదనుగుణంగా..ప్రణాళికలు తీసుకురావడం..
సమిష్టి కృషి అవసరం..
ప్రపంచ దేశాలు ఈ విషయమై ఐక్య రాజ్య సమితి పర్యవేక్షణ లో 
మంచి మార్పుకై 
పని చేయాలి..!
ప్రస్తుతం సామాన్య జనం భయం తో, 
బిక్కు బిక్కుమంటూ కాలాన్ని వెళ్లదీస్తున్నారు..!
ఉదాహణకు ఆఫ్ఘనిస్తాన్..!
ప్రపంచ శాంతి దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు..!🙏

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments