చిటపట చినుకులు--గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు

చిటపట చినుకులు--గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు

చిటపట చినుకులు
---------------------------------------
చినుకులు చినుకులు చినుకులు
ప్రాణం పొసే చినుకులు
చినుకుల వలనే పంటలు
విరియును రైతుల ఆశలు

రైతుల మోమున వెలుగులు
చినుకులు పడితే మెతుకులు
పచ్చగ ఎదుగును మొలకలు
పారును నిండుగ వాగులు

ప్రాణాధారము చినుకులు
పచ్చదనానికి బాటలు
కళకళలాడును చెరువులు
నిగనిగలాడును తరువులు

చిటపట కురిసే చినుకులు
భువి తలపై తలంబ్రాలు
పిల్లలు పెట్టే ముద్దులు
ముఖమున వెలసిన నగవులు

మానవ మనుగడ చినుకులు
రైతుల గుండెల శ్వాసలు
చినుకులు కురిసిన బ్రతుకులు
సాగుకు మేలిమి మిత్రులు

చినుకులు పడితే మోదము
పెంచును భువిలో అందము
చేయును ఎంతో సాయము
అన్నదాతలకు న్యాయము

--గద్వాల సోమన్న

0/Post a Comment/Comments