ప్రస్తుత జీవిన విధానం ---దొడ్డపనేని శ్రీవిద్య

ప్రస్తుత జీవిన విధానం ---దొడ్డపనేని శ్రీవిద్య

ప్రస్తుత జీవన విధానం

తెలివి తేటలకు కొదవలేదు
మమకారం ఎక్కడ కనపడదు

చదువు సంధ్యలలో రారాజు
జ్ఞానం విషయంలో మెదడుకి బూజు

ఇల్లు ఏమో మహా సౌధం
కుటుంబం మాత్రం మహాలఘం

చంద్రుడి పైన కాలుపెట్టి వస్తాం
ప్రక్కనున్నోడి బాధను కూడా పట్టించుకోం

ఖరీదైన ఆడంబరాలతో విర్ర వీగుతాం
సమయానికి విలువ ఇవ్వక అగచాట్లు పడతాం

చనిపోయేంత వరకూ బ్రతుకుతాం
పది మంది మనసుల్లో మాత్రం ఉండం

ఎన్నో సదస్సులలో వెర్రిగా పాల్గొంటాం
ఆచరణలో మాత్రం మనం  శూన్యం

శాస్త్రీయతలో  ఎంతో ముందున్నాం
మూఢ నమ్మకాలతో జీవితాల్ని చిదిమేస్తున్నాం

ఇతరులకి సలహాలను మా బాగా ఇస్తాం
సమస్యలని సాధించలేక వెనుకంజ వేస్తాం

అంతర్జాలం లో హుషారుగా కబుర్లు చెబుతాం
కుటుంబంతో మమేకమవటం ఎంతో కష్టం

ఆరోగ్యమే మహాభాగ్యము అని లెక్చర్‌ లు ఇస్తాం
అనారోగ్యంతో ఆపసోపాలు పడతాం

అంతరిక్షం దాకా పయనం సాగిస్తాం 
అంతరంగంలోని కుళ్ళుని మాత్రం తీసేయ్యం

జాతి మత భేదాలొద్దని మీటింగులు పెడతాం
మన ఇంటి వారిని నడి రోడ్డున పడేస్తాం

ఓ మిత్రమా !
ఆరోగ్యకరమైన భావాలతో సంతప్తిగా జీవించు.....
ఆనందమే నీ చిరునామాగా శ్వాశించు

- దొడ్డపనేని శ్రీవిద్య
విజయవాడ


0/Post a Comment/Comments