మా తెలుగు భాష..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

మా తెలుగు భాష..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

మా తెలుగు భాష..!(కవిత)

నీ శైలి సరళం..!
నీ యాస మధురం..!
నీ పదాలు సు మధురం..!
ఓ అందమైన భాష 
మా తెలుగు భాష..!

నీలో సాహిత్యం పదిలం..!
నీలో ఎనలేని పాండిత్యం..!
నీ కవిరాజులు ఎందరో..!
నీ వీరాభిమానులు మరెందరో..!
ఓ సొగసైన భాష..
మా తెలుగు భాష..!

నీ గతమెంతో ఘనం..!
నీ రాజసౌధాలలో ఆసనం..!
నీ తేటల తెలుగుదనం..!
విలసిల్లిన నీ రాజరికం..!
ఓ సౌకుమార్య భాష..
మా తెలుగు భాష..!

తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు..
❤️👍🙏
✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments