పుస్తక మస్తకం --దొడ్డపనేని శ్రీ విద్య

పుస్తక మస్తకం --దొడ్డపనేని శ్రీ విద్య


పుస్తకమస్తకం

పుస్తకం మనిషికి మంచి నేస్తం
అలసిన మనసుకి సేద తీర్చు సాధనం

గెలుపుకి పూ బాట పుస్తక పఠనం
జీవితానికి అదే  ఓ కాంతి కెరటం

మస్తిష్క ఆలోచనల మార్పుకు అంకురం
సత్యాన్ని అన్వేషించే ఆయధం
వాస్తవాన్ని తెలిపే చైతన్య పరిపుష్టిం

చదువు కన్న సంస్కారం ముఖ్యం
చదవటం తెలిస్తే మనిషే ఓ పుస్తకం

పుస్తకమే ఓ మంచి జ్ఞానం
అజ్ఞానమే మనిషి కి తిమిరం

పుస్తకం లేని ఇల్లు వృధా
మస్తకం లేని మనిషి వ్యధా

పుస్తకాన్ని చదవటం వదిలేయకు
మస్తకాన్ని వాడటంలో అశ్రద్ధ చేయకు

మెదడుకి ఎరువు చదువు
చదువుతో కలుగు కొలువు
గమ్యం కోసం పరుగు తీయు
మితి మీరిందా కలుగు కీడు

మెదడు చూపు బ్రతుకు తెరువు
తెలివి కలిగి మెలుగు
చదువుతో పోయెను మతి
చదివిస్తే మన ఆస్తి ఖాళీ

జ్ఞానం పై పట్టు బిగించు
సాధనతో వచ్చు గెలుపు కిరీటము
✒️🌈✒️🌈✒️🌈✒️

దొడ్డపనేని శ్రీ విద్య
విజయవాడ
13/09/2021
సోమవారం

0/Post a Comment/Comments