సంచార జీవులు --శ్రీమతి సత్య మొం డ్రేటి

సంచార జీవులు --శ్రీమతి సత్య మొం డ్రేటి

సంచార జీవులు

పుట్టి పెరిగిన ఊరు
పొట్ట నిండని పేరు
ఉన్న ఊరు లో బ్రతకలేక
కష్టజీవికి బ్రతుకు లేక
పొట్ట చేత ను బట్టి
వలస జీవులు జీవనభృతి కోసం సంచార జీవులుగా
జీవిస్తున్న భారతమాత బిడ్డలు
ఆహారము ఆవాసము వలువలు లేని జీవితం గడుపుతూ విలువను కోల్పోతున్న అభాగ్య జీవులు
అహర్నిశలు అలసట లేని బ్రతుకు గడుపుతూ ఆరోగ్యాన్ని అంధకారం చేసుకుంటూ కష్టసుఖాలు కావడి కుండలుగా మోస్తున్న భూమి తల్లి బిడ్డలు
అఖండ భారతావనిలో ఆశ్రయమిచ్చే దెవరు.. మానవతా మహోన్నత మూర్తులు...
దేశ నేతలకు ఓటు కోసమే గుర్తుకు వచ్చే జీవులు...
దేశ ప్రజలకు తిండి బట్ట నివాసం కల్పించే బాధ్యత దేశ నేతలదే......
జన సంపదే దేశ సౌభాగ్యం.... వలస బ్రతుకులకు స్థిర నివాసం ఏర్పరచి బ్రతుకు బాటను కల్పించాలి... వలస జీవుల జీవితాలకు ఆదరణ ఇవ్వాలి.. ఆదుకోవాలి ప్రభుత్వం.... ప్రజలు...



0/Post a Comment/Comments