మోక్షం ---సి. శేఖర్(సియస్సార్)

మోక్షం ---సి. శేఖర్(సియస్సార్)

 శీర్షిక: మోక్షం

నేను ప్రతిరోజలా ప్రయాణించే
మా నగర రోడ్డెప్పుడు 
అనాథలా చీలికలతో
అతుకుగతుకులతో ఆగమాగంజేస్తది
శరీరాన్నంత కుదిపేసి
నా ద్విచక్రవాహనాన్నేకాదు
నన్నుకూడ అప్పుడప్పుడు
సర్విసింగుకు సాగనంపేది
ఓ రోజు గుంతలోపడి
నన్ను తనతోపాటు
నా రక్తాన్ని నాకు చూయించింది మరి

ఈ రోజు పొద్దున్నే
నా కర్తవ్య నిర్వహనకై
కంగారుగా నేను
రోడ్డంతా స్వచ్ఛ కార్మికులతో కిటకిటలాడుతోంది
దుమ్మంతా చెత్తంతా మాయం
నేను నా పనికెళ్ళాను
తిరిగి సాయంకాలం
నా వాహనం సంతోషంగా
పరుగులు తీస్తోంది
గతుకుల రోడ్లుకు అతుకులేసి
కొత్త పెళ్ళికూతురిలా చక్కగా
నా నడుము సంబరానికంతేలేదు
ఏంటా ఆరాతీస్తే
మంత్రి కాలుపెడుతున్నడట
ఓహో మోక్షం ఇలా దొరికింది

అప్పుడప్పుడిలా మంత్రో ముఖ్యమంత్రో కాలుపెడితే
కష్టాలిట్లా తొలగిపోతాయ్
కాలం వాల్లెంటే మరి

సి. శేఖర్(సియస్సార్)
పాలమూరు,
9010480557.0/Post a Comment/Comments