ఏందిరో నీ గొడవ..!?(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

ఏందిరో నీ గొడవ..!?(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

ఏందిరో నీ గొడవ..!??(కవిత)

జనం గొడవ తన గొడవగా,
కవిత్వాన్ని కురిపించాడు..!
నోటిమాట.. గట్టిమాటగా కట్టిపడేసాడు..!
అన్న మాటలన్నీ..సమాజంలోని ఉన్న మాటలే..!??
ఎత్తిపొడుపులుగా కనిపించవచ్చు కాబోలు..కానీ నిత్య సత్యాలు..వాస్తవాలే కదా..!??
యాస మొరటుగా దర్శించవచ్చు..కానీ వినసొంపైనదే..!?
మార్పును ఆశించే..తిట్లూ గట్రా..!?
మంచిని ఆశించే..నోటి దురుసు..!?
ప్రజా కవైన పాపానికి..ఎన్ని కరడు,చాకు లాంటి మాటలో కదా..!??
కాళోజీ అంటేనే.. అంత..!
ఇంకేం మాట్లాడకూడదు..!??
లేకపోతే..నీది, ఏందిరో గొడవ అని తీరుతాడు..!??
యదార్థవాది లోక విరోధి..!
అని ఊరకే అనలేదు..!??
కాళోజీ నారాయణరావు గారికి జన్మ దిన శుభాకాంక్షలు..!
❤️👍🙏🙏

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్,నాగర్ కర్నూల్ జిల్లా,తెలంగాణ.

0/Post a Comment/Comments