అంతర్ముఖం. --సయ్యద్ జహీర్ అహ్మద్,

అంతర్ముఖం. --సయ్యద్ జహీర్ అహ్మద్,      అంతర్ముఖం

నవరసాలొలికించు బాలరాజు
నవరాత్రి నిశీధి గమనంలో
నాయిక పాత్ర ఔచిత్యం
ప్రేమలోకంలో మైమరచిపోయే యువరాజు
విరహ సంద్రంలో మునిగి తేలిపోయే దేవదాసు!

భక్తి ముక్తి వరప్రసాద శక్తియుత పాత్రోచితం
నేటి కౌశలాన్ని రక్తి కట్టించే చక్రధారి!!
చక్కని చిక్కని చెరగని చిరునవ్వుల గని
చెలిని చక్కిలిగింతల పెట్టి నటనమాడే బ్రహ్మచారి
కుటుంబ నేపధ్య సమస్యల సుడిగుండాలు
ఎదురరీది ముగింపు కథ సుఖాంతం చేసే సుపుత్రుడు
రాజకీయ జూదంలో కపట పాచికల్ని చూసి
దూరాలోచనతో స్తబ్దుడైన బహుదూరపు బాటసారి
మూడు తరాల ముచ్చటైన నాయికల సరసన
ఆడి పాడి ముద్ధుమురిపాలు పంచిన అందాల రాముడు
నవలా సామ్రాజ్యానికి ఏకైక చక్రవర్తి
నాయికారాణులతో దీటుగా డాక్టర్ చక్రవర్తి!!
సీతారామ జననంతో సినీరంగ ప్రవేశమై
కళాప్రపూర్ణ, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, రఘుపతి వెంకయ్య, దాదా సాహెబ్ ఫాల్కే,
యన్.టి.ఆర్. పలు పురస్కారాల గ్రహీత
నటసామ్రాట్ డాక్టరేట్
నీ నటనకు నిలువెత్తు
శోభాయమానం స్వర్ణభూషణం!
అందమంతా నీ స్వంతం
మహాకవి కాళిదాసు
మహాకవి క్షేత్రయ్య
తెనాలి రామకృష్ణుడు
భక్త తుకారాం
భక్త జయదేవ
భక్తి గీతాల పారవశ్యంలో అరుదైన ప్రజ్ఞ
నాట్యంలో నట్టువకత్తెకు తెలియదు 
నీ నర్తన భంగిమ!
అలరారుతూ ఆంధ్ర జనుల మనసున
అభిమాన జల్లులతోన!
            *****

సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు
చరవాణి:9505152560

           

0/Post a Comment/Comments