ఉపాధ్యాయులారా జోహార్లు --డా విడి రాజగోపాల్

ఉపాధ్యాయులారా జోహార్లు --డా విడి రాజగోపాల్

 

   Happy Teacher’s Day 2021ఉపాధ్యాయులారా జోహార్లు

అమ్మ వడిలో పెరిగిన పసికందు
అలా అలా తప్పటడుగులు వేస్తూ
కాస్త నిలకడైన నడక రాగానే
పట్టించేది  బడి బాట

బడిదారి పట్టేందుకు ఏడవని రోజుండదు
క్రమంగా ఆ అమ్మ చాటు బాలబాలికలను
అక్కునచేర్చుకొని  లాలించి
ఆటపాటలతో ఆకర్షించి
అ ఆ అంటూ ఇ ఈ అంటూ
అక్షర జ్ఞానం ప్రసాదించింది
మనకు తల్లి దండ్రుల తరువాత
ఓ ముఖ్యమైన  పాత్ర పోషించినవాడే
ఉపాధ్యాయుడు

అల్లరి మనసును అదుపున పెట్టి
నడవడిక నడక నేర్పించిన ఉన్నతుడు
మన ఉపాధ్యాయుడు

చెవి తిప్పినా చెంప ఛెల్లుమనిపించినా
అరచేయి కందిపోయె కర్రదెబ్బలు కొట్టినా
మన మేలుకోరే కదా!

ఉలిదెబ్బలతో ఓ శిలను 
శిల్పంగా మార్చినటుల  
మన జీవితాన్ని అందమైన శిల్పంగా మార్చిన 
ఉన్నతుడు ఉపాధ్యాయుడు

ముద్ద బంగారాన్ని కంసాలి 
ఎన్ని దెబ్బలు వేయందే 
ఓ అందమైన ఆభరణం కానట్లు 
నయాన్నో భయాన్నో మందలించి  
మనల్ని ఇంతవారిని చేసిన 
మహోన్నతుడు ఉపాధ్యాయుడు

తనకు జీతం వచ్చినా రాకున్నా బడి మానడు
విద్యార్థుల మోము చూడనిదే
ముద్ద దిగని ఓ కారణ జన్ముడు గురువు

భారత మాత కన్న ఓ అద్భుత వ్యక్తి
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ
ఓ ఉపాధ్యాయవృత్తికి ప్రతీక
వారి జయంతి  ఉపాధ్యాయ దినోత్సవమైంది
వారిని స్మరించుకొంటూ...
ఎంతో మంది అలాంటి ఉపాధ్యాయులు
మన ఉన్నత స్థితికి  కారకులు
ఓ మారు అందరినీ స్మరించుకుందాం

ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు

--డా విడి రాజగోపాల్
9505690690


 

0/Post a Comment/Comments