"గురువు" ప్రక్రియ: మణిపూసలు (రూపకర్త: శ్రీ వడిచర్ల సత్యం గారు) ---మార్గం కృష్ణ మూర్తి

"గురువు" ప్రక్రియ: మణిపూసలు (రూపకర్త: శ్రీ వడిచర్ల సత్యం గారు) ---మార్గం కృష్ణ మూర్తి

- మార్గం కృష్ణ మూర్తి

శీర్షిక: గురువు
ప్రక్రియ: మణిపూసలు
(రూపకర్త: శ్రీ వడిచర్ల సత్యం గారు)

01.
చదువులను చెప్పేగురువు
సంస్కారం నేర్పుగురువు
భగవత్ స్వరూపుడూ
గురువులకే గొప్పగురువు

02.
పాఠాలను నేర్పు గురువు
గుణాలను నేర్పు గురువు
విజ్ఞానాన్నేకాదు
క్రమశిక్షణ నేర్పుగురువు

03.
స్వార్ధం ఉండదు గురువుకు
ద్వేషం ఉండదు గురువుకు
పేద ధనిక విద్యార్ధుల
భేదం ఉండదు గురువుకు

04.
ప్రజలకు, మార్గం చూపును
సమాజాన్ని నడిపించును
గురువుమేధావులపెంచి
దేశాన్నీ నడిపించును 

05.
నిశిని పారదోలువారు
చెడునుతొలగించేవారు
దేశ, ప్రజలందరితో
గౌరవించబడే వారు

06.
భాద్యతలనెరుగినగురువు
నీతిని బోధించు గురువు
తమ శిష్యుందరికీ
సమరసతను నేర్పుగురువు

07.
చిన్న చిన్న కథలు చెప్పు
మంచిమాటలనూ చెప్పు
బహుమతులనూయిచ్చు
దండించైననూ చెప్పు

08.
మానవతావాది గురువు
ఆదర్శావాది గురువు
విద్యార్ధుల హితంకోరు
శ్రేయోభిలాషీ గురువు

09.
కులంమతంలేనివృత్తి
పేదధనికలేనివృత్తి
వృత్తులలోఉత్తమం
ఉపాధ్యాయుడనేవృత్తి

10.
వేదవ్యాసమహర్షులు
వశిష్ట విశ్వామిత్రులు
భీష్మగౌతములందరూ
ద్రోణ వాళ్మీకి గురువులు

డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు

మార్గం కృష్ణమూర్తి
హైదరాబాద్

0/Post a Comment/Comments