నాయక మా వినాయక (కవిత). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.

నాయక మా వినాయక (కవిత). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.

నాయక మా వినాయక
--------------------------------

నాయక నాయక నాయక
ఓవినాయక మా నాయక
సంసార సాగరమందున్నం
నిండా మునిగి తేలుతున్న !

విశ్వము నేలే మా విశ్వ నాయక
ఉండలేం మేం గుంజీలు తీయక
నాయక నాయక ఓ మా నాయక
మా వినాయక మా మహా నాయక !

మంత్రోచ్ఛారణలతో అర్చన చేస్తిమి
ఉవ్విల్లూరుతూ ఉండ్రాళ్ళు చేస్తిమి
రంగురంగుల పూలతో పూజిస్తిమి
రకరకాల మాలలు మెడలో వేస్తిమి 

మనసారా నిన్నే కొలుస్తున్నాం
మా నోరార నిన్నే తలుస్తున్నాం
నాయక నాయక మా వినాయక
ఓ మా వినాయక మా గణనాయక!

ప్రతి చవితికి పూజలు చేస్తాం
నీవు కోరిన గుంజీళ్ళను తీస్తాం
నీ విగ్రహ ప్రతిష్టను మేం చేస్తాం
నిగ్రహంగా నీ వ్రతాన్ని చూస్తాం !

మట్టి విగ్రహాన్ని తయారు చేస్తాం
పర్యావరణాన్ని ఇక మేం రక్షిస్తాం
ఐకమత్యాన్ని మేం ప్రదర్శిస్తాం
సఖ్యత సందేశాన్ని  అందిస్తాం!

పాహిమాం పాహిమాం అనుకుంటూ
పంచాక్షరి మంత్రాన్ని మేము వినుకుంటూ
మోక్షం ఇవ్వాలని నిన్నే మేం కోరుకుంటూ
చేస్తాం నీ వ్రతాన్ని ఇక సమాప్తం
చూస్తాం అందించే పుణ్య ప్రాప్తం !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.

0/Post a Comment/Comments