పుణ్యభూమి --- పేరు అద్దంకి లక్ష్మి ఊరు ముంబై

పుణ్యభూమి --- పేరు అద్దంకి లక్ష్మి ఊరు ముంబై

14_9_21



      సంస్కృతి సంప్రదాయాలకు , వేదభూమి నిలయమైన భారత దేశం.
       తల్లీ నీకు వందనం.
       ఈ  దేశంలో పుట్టిన భారతీయుల జన్మ పుణ్యఫలం.
       ధర్మం నాలుగు పాదాల నడయాడిన రామ జన్మ భూమి .
        వజ్రోత్సవాలు జరుపుకునే ఆనందోత్సాహం.
     వందేమాతరం అంటూ ఝాన్సీ లక్ష్మీబాయి మొదలయిన మొదటి జాతీయ సంగ్రామం.        ఎందరో వీరుల త్యాగ ఫలం.జాతీయోద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరులు.
     స్వాతంత్ర్యం లభించిన తరువాత దేశ ప్రగతికి పాటుపడిన,,
     మన దేశ నాయకులు.  
     వారి నిస్వార్థ జీవనం సేవానిరతి మనందరికీ ఆదర్శ మార్గం..
      కానీ  నేటి భారతం...
       అయోమయం.
      రాజకీయ కుతంత్రాలు దేశాన్ని విచ్ఛిన్నం..
      కుల మత వర్గాల విభేదాలతో సమాజంలో అశాంతి...కర్తవ్యాలను మరచిన ప్రజానీకం..
     మంచు కొండల పై రేయిపగలు దేశ రక్షణ గావించే  వీర సైనికులను గౌరవించి                    స్మరించే    భారతీయుల కర్తవ్యం
      మరువ రాదు.
     అన్నదాతలను ఆత్మహత్యల నుండి కాపాడి ,వారిని ఆదుకునే మార్గం...
     పచ్చని పైరులతో దేశం సస్యశ్యామలమై అన్నదాత కన్నులలో వెలుగులు విరజిమ్మాలి.
     స్వచ్ఛమైన నీటిని ప్లాస్టిక్తో కలుషితం చేయరాదు.
     వాతావరణ పరిరక్షణ ప్రతి భారతీయుని బాధ్యత.
     దేశాన్ని విచ్ఛిన్నం చేసే విద్రోహ చర్యలను అణగదొక్కే బాధ్యత ప్రతి భారతీయునిదే..
     మూడు రంగుల మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూ ఎర్రకోటపై జైహింద్ నినాదం              చేయాలి..
     సాంకేతిక పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు.
      యువత దేశ అభివృద్ధికి పాటుపడాలి.
     దేశ ప్రజలు నైతిక విలువలను పాటించి  
     దేశం సుభిక్షంగా ప్రగతిపథంలో విజయపతాకం ఎగురవేయాలని ప్రతి భారతీయుడు           ప్రతిజ్ఞ చేయాలి
     ఈ వజ్రోత్సవ  సందర్భంలో...

        --పేరు అద్దంకి లక్ష్మీ
     ఊరు ముంబై
     సెల్ నెంబరు
      9 7 5 7 0 4 3 4 6 9

0/Post a Comment/Comments