ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల భాదలు - మహేష్ కురుమ

ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల భాదలు - మహేష్ కురుమ

ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల భాధలు

నట్ట నడి ఎండలో యాజమాన్యం 
విద్యార్థుల కోసం నన్ను 
వస్తువులు అమ్మే వ్యక్తిలా 
ఇంటింటికీ తిప్పినపుడే 
నా మనసు భాద పడింది ...

ప్రధానోపాధ్యాయుడి ముందు
విద్యార్థుల తల్లదండ్రుల ముందు 
నేను చేతులు కట్టుకొని 
దోషి లాగ సంజాయిషీ చెప్పినపుడే 
నా హృదయం ముక్కలైంది ... 

జెండా వందనం రోజు 
మీ రాక కోసం మేము 
ద్వారపాలకుల్లా నిలబడ్డపుడే 
మా గౌరవం గంగలో కలిసింది ....

నాలుగు గోడల మధ్య 
మేము చెప్పే పాటాలకు 
మీ నిఘా నేత్రాలు అమర్చినపుడే 
మా పై మాకు విరక్తి చెందింది ...

ప్రత్యేక తరగుల పేరిట 
మా శ్రమని నిలువునా దోచుకున్నపుడే 
మేము సహనం కోల్పోయాము ...

మీ పేరు ప్రఖ్యాతుల కోసం మమ్మల్ని 
మర యంత్రాలుగా వాడుకున్నపుడే 
మేము మీ చేతుల్లో కీలుబొమ్మలమయ్యాము ...

పేరు : మహేష్ కురుమ
ఉస్మానియా తెలుగు రచయితల సంఘం సభ్యులు
ఊరు : పరిగి ,
          వికారాబాద్ ( జిల్లా )
          తెలంగాణ ( రాష్ట్రం)
          9642665934

0/Post a Comment/Comments