గురువు పై కవిత --వైద్య. శేషారావు, కామారెడ్డి, ఒప్పంద అధ్యాపకులు, రాజనీతి శాస్త్రం, ప్రభుత్వ జూనియర్ కళాశాల దోమకొండ.

గురువు పై కవిత --వైద్య. శేషారావు, కామారెడ్డి, ఒప్పంద అధ్యాపకులు, రాజనీతి శాస్త్రం, ప్రభుత్వ జూనియర్ కళాశాల దోమకొండ.

సూర్యుడు
చీకట్లను చీల్చి
వెలుతురును ఇచ్చే దివిటి
తరాలు మారిన అంతరాలు ఎన్నివచ్చిన
గురు స్థానం గురితప్ప దు
ఎత్తు పల్లాలు సహజమే
కాలంతో ఆహార్యం మారింది
సామాజపు ఆలోచనాల్లో మార్పులు
ఒక నాడు గురువుదగ్గర శిష్యరికాలు
నేడు శిష్యుల వద్దకు పరుగులట
గీతను బోధించిన కృష్ణుడు
అయిన సందీపుని వద్ద
సంస్కరి అయ్యారు
కార్పొరేట్ కల్చర్ లో
ఉపాధ్యాయుల స్థితి మారే
ధనం చుట్టూ భ్రమించే
అప్పుడు బోధించారు జీవన మార్గం..
బతుకు ముక్తి మార్గం
ఇప్పుడు మార్కులు పొందే యంత్రాలు 
కృత్రిమ జీవన విధానాలు
కాలం కాటేసింది
సన్మార్గం మసుకబారింది
ఏకలవ్యుడు గురును గ్రహించే
యుగాలు మరీనా
అమ్మే జన్మ నిస్తుంది
అక్షరం నేర్పే క్షారం లేని దేవుడు గురువే
ఏ రంగం అయిన
చెట్టు ముందా విత్తు ముందా అప్రస్తుతం
చెట్టును తయారు చేసే
విత్తునుసృష్టించే పూడిమి గురువు
అంతర్లీనంగా దాగి ఉన్న
సత్యం ఈ లోకమే గురువు

వైద్య. శేషారావు
కామారెడ్డి ఒప్పంద అధ్యాపకులు
రాజనీతి శాస్త్రం, ప్రభుత్వ జూనియర్ కళాశాల
దోమకొండ



0/Post a Comment/Comments