రారా గణపయ్య :ఐశ్వర్య రెడ్డి గంట

రారా గణపయ్య :ఐశ్వర్య రెడ్డి గంట

అంశం:బాల గేయం( రారా గణపయ్య)  పార్వతి పుత్ర ప్రియనందన 
నువ్వే మాకు దిక్కయ్యా
 రారా గణపయ్య రావయ్యా 
మమ్మును కాపాడ రావయ్యా 

మంటపాలను సిద్ధం చేసి 
మామిడాకు తోరణాలు కట్టామయ్య
పూలు పండ్లు దండిగ తెచ్చి 
నీ పూజ కోసం ఉంచామయ్య
                     "రారా గణపయ్యా"
 
 పంచామృతాలు సిద్ధం చేసి
నీ అభిషేకానికి ఉంచామయ్య
ఇలలోన వింత రోగాలతో
అస్తవ్యస్తమవుతున్నామయ్య
                          "రారా గణపయ్యా"

 మా కష్టాలు బాధలు నీకు చెప్ప
 కన్నీళ్ల తో వేచి ఉన్నామయ్య
మా బాధలను తీర్చి మమ్మేలరా
 సంతోషాల పండగ తేవయ్యా
                          "రారా గణపయ్యా"


ఐశ్వర్య రెడ్డి గంట
హైదరాబాద్

హమీ పత్రం:ఈ గేయం నా స్వీయ రచన అని హమీ ఇస్తున్నాను. 

1/Post a Comment/Comments

Post a Comment