అశ్రు నయనాలతో చేస్తున్న విన్నపము... ఐశ్వర్య రెడ్డి
అన్నింటా సగమని, అవనికి రూపమని
మాతృమూర్తే దైవమని
స్త్రీ యే సృష్టికి మూలమని
నమ్మిన నా భారతావనిలో
మద పొరలు కమ్మిన క్రూరమృగాలు,
ఆంబోతు లై పేట్రేగి పోతుంటే
ఆడ పిల్లల జీవితాలను మూర్ఖంగా ముగిస్తుంటే
ఏం చేస్తున్నాయు ఈ చట్టాలు ,
ఎటు పోతున్నాయి సమాజపు కట్టుబాట్లు
ఆడపిల్లల కన్న తల్లిదండ్రులు
అహర్నిశలు భయపడి చస్తుంటే,
కాలానాగులు కాటు వేసి
పసిపిల్లల సైతం చిదిమేస్తున్న
కామందులైన దుర్మార్గులను
వెనకా ముందు ఆలోచించకుండా
నడిబజారులో ఊరితీయాలి
అందరూ చూడగా వాడి
కండకావరాన్ని అణగదోక్కాలి,
కన్నెర్ర చేసి ఇలాంటి మానవ మృగాలను
భయపెట్టే లాగా శిక్షించాలి.
సత్వరమే శిక్షలు అమలయ్యేలా
ఆడవారి స్వేచ్ఛకు అడ్డు తగలకుండా
శిక్షాస్మృతిలను మార్చి,
ఇలాంటి దురాగతాలు మళ్లీ మళ్లీ జరగకుండా
శిక్షలను అమలు చేయాలి.
సంఘటన జరిగిన వెంటనే హడావుడి చేసి
తర్వాత నిద్రపోకుండా ఎప్పుడు
ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా
ఇలాంటి ఉన్మాదు లను ఏరి పారేయాలి.
క్యాండిల్స్ పట్టుకొన్నంత మాత్రాన
మౌనం పాటించనంతమాత్రాన జరగదు న్యాయం
వెంట వెంటనే శిక్షను అమలు చేసి
వాడిని కూడా కాటికి పంపిస్తే జరుగుతోంది న్యాయం ,
ఆ దిశగా ఆలోచించి ఎప్పుడో రాసిన చట్టాలను
ఇప్పుడు అమలుపరచకుండా
కొత్త చట్టాలను ఇప్పటి మనుషులకు తగ్గట్టుగా
ఇప్పుడున్న వ్యవస్థ కు తగ్గట్టుగా పున:నిర్మిచాలి.
ఒక అమ్మగా ఇదే నేను కోరుకునేది.
అన్యాయంగా ఇలాంటి చిట్టితల్లులు
మరి ఇంకెందరో బలి కాకుండా
సత్వరంగా మంచి నిర్ణయాలు తీసుకోవాలని
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆపాలని కోరుకుంటూ
ఐశ్వర్యా రెడ్డి