హిందీ- మణి పూసలు -వడ్ల నర్సింహా చారి

హిందీ- మణి పూసలు -వడ్ల నర్సింహా చారి

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
     *🎊హిందీ- మణిపూసలు🎊*
*************************

*_దేశ భాషగహిందీ_*
*_రాజ భాషగ హిందీ_*
*_ప్రజ్వరిల్లెను చూడు_*
*_ప్రజల భాషగ హిందీ_*!!

*_కవుల కలములందున_*
*_కవుల రచన లందున_*
*_మెరిసింది మన హిందీ_*
*_జనుల మనము లందున!!_*

*_తులసి చేతిలో ఒదిగె_*
*_రహీమ్ చేతిలో ఒదిగె_*
*_తేజరిల్లగ హిందీ_*
*_కబీర్ చేతిలో ఒదిగె!!_*

*_జనులు మెచ్చెడి భాష_*
*_జనుల కొచ్చెడి భాష_*
*_భారతావని యంత_*
*_పలుక గలిగిన భాష!!_*

*_ఆత్మ యందున నిలిచి_*
*_దోహ లందున నిలిచి_*
*_రంజిల్లె నీ భాష_*
*_హిందిగా  హృది గెలిచి!!_*

*........✍️మణికర్ణిక🌹☘️*
*ZPHS. శేరిలింగంపల్లి*
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼 

0/Post a Comment/Comments