కట్టమంచి రామలింగారెడ్డి --- పేరు అద్దంకి లక్ష్మి ఊరు ముంబై

కట్టమంచి రామలింగారెడ్డి --- పేరు అద్దంకి లక్ష్మి ఊరు ముంబై


శీర్షిక కట్టమంచి రామలింగారెడ్డి

139

కట్టమంచి ఇంటి పేరు
రామలింగారెడ్డి వారు
చిత్తూరులోపుట్టి నారు
బాల మేధావి వారు

140

పోటీలకు నవ్య కావ్యము
అదె  ముసలమ్మ మరణము
రాసేను లఘు కావ్యము
పొందె బంగారు పతకము

141

కేంబ్రిడ్జ్ విద్యాలయములొ
చదివే తత్వ శాస్త్రములొ
మన్నన పొంది రందరిలొ
వచ్చే ఉత్తమ శ్రేణిలొ

142

సరికొత్త భావాలు
నూతన ఆలోచనలు
కవిత్వపు  పోకడలు
వారి  మనోవికాసాలు

143

వక్తగ మరియు కవిగ
గొప్ప  విమర్శకుడుగ  
మరియు  ఆదర్శవాదిగ  
బహుముఖ ప్రజ్ఞాశాలిగ

144

వారి సమయస్ఫూర్తికి
సహజ వాగ్ధాటికి
వారి హాస్యచతురతకి
ప్రఖ్యాతి  రెడ్డి గారికి

145

కట్టిరి  విద్యాలయములు
పెట్టి రెన్నొ విగ్రహములు
ఇచ్చిరి పురస్కారములు
మరియు సత్కారములు

-- అద్దంకి లక్ష్మి,
ఊరు ముంబై.

0/Post a Comment/Comments