మదిచేసే గారడీ
మహా మాయ
మది చేసే గారడీ
మరువలేని పేరడీ
ఆశల ఊయలలో
ఊగిస్తుంది...
ఆకాశానికి నిచ్చెన వేస్తుంది
అందని ద్రాక్ష అందిస్తుంది
ఇల లో కలలో జరగనివి
జరిపిస్తుంది...
కోతి కొమ్మచ్చి ఆట ఆడిస్తుంది
అంతరిక్ష నౌక కు లేని వేగం
మది కి ఉంది...
మంచి చేసే గారికి మంచి చెడ్డలు ఉండవు
కట్టుబాట్లు కనపడవు అంధకార పు గారడీలో మనల్ని పడేస్తుంది.... ఆద్యంతము లెరిగి మదిగారడీ ని హద్దుల్లో ఉంచి క్రమశిక్షణ తో మసిలితే విజయమే.....
మనసు గారడీ కి మనలగితే
ముళ్ల దారులు తధ్యం
అరి చేతిలో వైకుంఠం చూపిస్తుంది...
ఆశలకు ఆద్యం పోస్తుంది
మనసు మన ఆధీనంలో
ఉంచితే గారడీ లకు కనికట్టు లకు చుక్కపెట్టొచ్చు..... మది చేసే గారడీ మహా మాయ.
ఆ గారడీ లో పడిన వాళ్ళు
మాయా లోకానికి బలి అవుతారు......తెలుసుకుని
మసలుకోండి మిత్రులారా..!
పేరు:శ్రీమతి సత్య మొం డ్రేటి
ఊరు హైదరాబాద్
చరవాణి:9490239581
ప్రక్రియ: వచనం