సమస్యాత్మక మనుష్యులు..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

సమస్యాత్మక మనుష్యులు..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

సమస్యాత్మక మనుష్యులు..!(కవిత)

ఎన్నెన్నో సమస్యలు ఈ లోకంలో..!
మనుష్యులు కూడ సమస్యల సృష్టి కోసమే పుట్టారా అనిపించక మానదు..!?
ఎందుకంటే ఏం పని లేనట్లు కొత్త కొత్త సమస్యలు పుట్టిస్తారు..!
శాంతియుతంగా జీవించడం చేత కాదన్నట్లు..!??
మత విద్వేషాలు సృష్టిస్తారు,
మత కలహాలు రగిలిస్తామంటారు..!
కులాలను,మతాలనే ఎక్కువగా లక్ష్య పెడుతూ మాటల తూటాలు 
పేలుస్తారు..!
కేవలం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే..ఈ తతంగమంతా..!
ఎవరిదో నెత్తి ఎవరిదో కత్తి అన్నట్లు ఉంటుంది..
వీళ్ళ వ్యవహారం..!?
కలిసి మెలిసి జీవిస్తున్న ప్రజా సంబంధాల్లో చిచ్చులు పెట్ట పుట్టినట్టున్నారు..మహానుభావులు..!??
తిన్నది అరగక ఏదంటే అది మాట్లాడుతూ..సమాజాన్ని కలుషితం చేయ వచ్చారు..!??
జిత్తులమారి నక్క లాంటి విద్రోహుల్ని ప్రజలే అర్థం చేసుకొని ,దూరంగా నెట్టేస్తారు..జాగ్రత్త..!???

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments