సీసముII
అజ్ఞాన ధ్వాంతాలు వ్యాపించనీయక
-----విజ్ఞాన భానుడై వెలుగునితడు
సర్వోన్నతంబైన చదువను నెరువును
-----నక్షరాలైపంచు హాలికుండు
సన్మార్గ భవితకు చక్కని బాటను
-----తండ్రి వలెను జూపు దార్శనికుఁడు
బ్రహ్మ, విష్ణు, శివరూపముగను ధరణిలో!
-----కీర్తి బడసినట్టి మూర్తియితఁడు
తేటగీతిII
ధర్మ సత్యములనుదెల్పు ధర్మమూర్తి
మంచి నడతనేర్పించెడి మహినిరేడు
నుత్తమంబైన స్థితినిచ్చు నొజ్జరూప
పద్య ప్రణతులన్! గైకొను పరమపూజ్య.
-------------------------------------------------------------------
రచన: రఘుపాత్రుని సాయిశివ,
బి.ఏ (తెలుగుసాహిత్యము) ద్వితీయ సంవత్సరము,
పలాస మండలం, శ్రీకాకుళంజిల్లా, బ్రాహ్మణతర్లా గ్రామం.