'ఆ స్వరం..సుమధుర గాన సంద్రం!'(వచన కవిత) గాన గంధర్వుడు శ్రీ.ఎస్పీ.బాలు గారి ప్రథమ వర్థంతి సందర్భంగా... --సుజాత.పి.వి.ఎల్,

'ఆ స్వరం..సుమధుర గాన సంద్రం!'(వచన కవిత) గాన గంధర్వుడు శ్రీ.ఎస్పీ.బాలు గారి ప్రథమ వర్థంతి సందర్భంగా... --సుజాత.పి.వి.ఎల్,


'ఆ స్వరం..సుమధుర గాన సంద్రం!'
(వచన కవిత)


సుమధుర గాన సంద్రం ఆగిపోయిది..
ఆటపాటలతో అందరినీ అలరించిన 
'బాలు'డి అల్లరి చేష్టలు లేక
సంగీత వాయిద్యాలు మూగబోయాయి..
'శంకరా నాద శరీరాపరా!'..అని అమృతాన్ని పంచిన ఆ స్వరం..శివ సాన్నిధ్యాన్ని పొందింది..
కోటాను కోట్ల ప్రజల హృదయాల్లో..సుస్థిర స్థానాన్ని నిలుపుకున్న ఆ స్వరం..
స్వర్గం చేరుకుంది..
ముఖంపై ఎన్నడూ చెరగని చిరునవ్వుతో..
పసి'బాలు'డిలా..మళ్ళీ నే తిరిగొస్తానని 
చివరి సారి మాటలు..తలుచుకుంటుంటే..
నాడు అమృతం కోసం చేసిన పోరులో..
నీ గానామృతాన్ని పొందేందుకు నేడు దేవతల పన్నాగం అనిపిస్తుంది..
అవునులే..'నువ్వు దివిలో విరిసిన పారిజాతానివి..
మమ్మునలరించేందుకు 'తరలిరాద తనే వసంతం' అంటూ మా కోసం భువికి దిగి వచ్చిన 
గాన గంధర్వుడివి..
'ఒక్కడై రావడం..ఒక్కడే పౌవటం' అని 
పాటతో  వేదాంతాన్ని తెలిపిన బ్రహ్మజ్ఞానివి..
'అంతర్యామి అలసితి సొలసితి' అంటూ..
అనంత లోకాలకు తరలిపోయిందా ఆ స్వరం..!
తలచుకుంటేనే గుండె పిండేస్తుంది..
నీవు లేని లోటు ఎవరు తీర్చలేనిది..బాలూ!!

--సుజాత.పి.వి.ఎల్,
సైనిక్ పురి, సికిందరాబాద్.


0/Post a Comment/Comments