ఆద్యాత్మిక కర్మ - యోగ ప్రక్రియ --దొడ్డపనేని శ్రీ విద్య

ఆద్యాత్మిక కర్మ - యోగ ప్రక్రియ --దొడ్డపనేని శ్రీ విద్య

కర్మము _ యోగము

ఇహలోక బంధాలు, వాటి వలన కలుగు సుఖములు గురించి అతిగా ఆలోచించడం వలనే మానవుడు మనశ్శాంతిని కోల్పోతున్నాడు.

మనశ్శాంతి మానవునికి సహజంగా   పుట్టుకతోనే ఉంటున్నది. 
కానీ వయసు పెరుగుతున్న కొలది 'నేను, నాది' అనే అహంకార, మమకారం, అనురాగాలు పెంచుకోవడం మూలానా అది క్రమేపి తగ్గిపోతూ ఉంటుంది.

ఫలితంగా మనిషి నిరంతరం ఏదో ఓ చింతతో బాధపడుతూ ఉంటుంటాడు... 
కడుపు నిండినంత చాలు ఆకలి తీరడానికి, అంతకు మించి ఎక్కువైతే మనకే ప్రమాదం. బంధుమిత్రులకు  చేయగలిగినంత చేయండి. 
వారి బుుణబంధ విముక్తికి అవి చాలు. ఈ బంధాలు గురించి ఎంత తక్కువుగా ఆలోచిస్తే అంత మనశ్శాంతి అన్న విషయం మరువకూడదు...
బంధంతోనే మనకు వచ్చు కర్మ యోగము
                        
 పంచమహాభూతములు, మిథ్యాహంకారము, బుద్ధి, అవ్యక్తము, దశేంద్రియములు. మనస్సు, ఐదు ఇంద్రియార్థములు, కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, సముదాయము, జీవలక్షణములు, విశ్వాసము అనునవి సంగ్రహముగా కర్మ క్షేత్రముగను. దాని అంతఃప్రక్రియలు గా భావింపబడు చున్నవి.
బంధ కర్మ నుంచి విముక్తి కలుగుటకు ప్రయత్నము చేయవలెను. అదియే శాశ్వత పరమాత్మ యోగం కి ఉపకరణం కాగలదు.

 మిథ్యాహంకారము, బుద్ధి, ప్రకృతి జన్య త్రిగుణముల అవ్యక్తస్థితి. ఆ తరువాత త్వక్, చక్షు, శ్రోత్రి, జిహ్వ, ఘ్రాణములనెడి పంచ జ్ఞానేంద్రియములు, ఆ పిదప వాక్కు, పాదములు, హస్తములు, గుదము, జననేంద్రియములనెడి పంచ కర్మేంద్రియములు, ఆ ఇంద్రియములపై మనస్సు గలవు. ఈ మనస్సు ఆంతరమందుండుటచే ఆంతరేంద్రియముగా పిలువబడును. కావున మనస్సుతో కలిపి మొత్తము పదునొకండు ఇంద్రియములు గలవు. ఇక శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనెడి ఇంద్రియార్థములు ఐదు. ఈ ఇరువది నాలుగు వంశముల సముదాయమే కర్మ క్షేత్రమని పిలువబడు చున్నది. ఇక అంతః ప్రక్రియలైన కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము అనునవి దేహమునందు పంచ భూతముల యొక్క ప్రాతినిధ్యములు.
 
అదే విధముగా చైతన్యముచే సూచింపబడు జీవలక్షణములు మరియు విశ్వాసమనునవి మనస్సు, బుద్ధి, అహంకారమను సూక్ష్మశరీరము యొక్క వ్యక్తరూపములు. ఈ సూక్ష్మాంశములు కర్మ క్షేత్రము నందే చేర్చబడి యున్నవి. పంచమహాభూతములు మిథ్యాహంకారము యొక్క స్థూలప్రాతినిధ్యము కాగా, మిథ్యాహంకారము తన మూల స్థితి యైన '' తామస బుద్ధి '' కి ప్రాతినిధ్యము వహించును. ఇట్టి భౌతిక భావనయైన తామస బుద్ధి భౌతిక ప్రకృతి గుణముల అవ్యక్తస్థితిని సూచించును. అట్టి భౌతిక ప్రకృతి త్రిగుణముల అవ్యక్తస్థితియే '' ప్రధానము '' అని పిలువబడును. ఈ అన్ని అంశముల యొక్క ప్రాతినిధ్యమే శరీరము. అట్టి శరీరము జన్మించుట నుండి నశించుట వరకు వివిధములైన మార్పులకు లోనగును. కనుక కర్మ క్షేత్రము అశాశ్వతమైన భౌతికపదార్థము. అయినను క్షేత్రము నెరిగినట్టి దాని యజమాని యైన క్షేత్రజ్ఞుడు మాత్రము దానికి భిన్నుడై యుండును.

లోకంలో త్రికరణ శుద్ధిగా అజ్ఞానందకారకులు కు లోబడి మాయకు చిక్కి బాహ్య దృశ్య స్మృతులను సత్యములుగా భావించుట యే యోగము. 
ఆ విషయములన్నీ కేవలం మనః కల్పితలని తెలుసు కొనక అజ్ఞానం లో పడి రోగమునకు బానిశలవటమే శోచనీయం. భోగ వస్తువులని ఎంచక శరీరాన్ని దహించే ప్రాపంచిక సుఖాల వెంట పరుగిడక ఔషధములనే  భగవంతుని పాద పద్మములను వీడక యోగము కర్మ దీక్ష చేస్తూ ఉండటమే మానవుల ప్రథమ కర్తవ్యం. 
హృదయంలో వెలుగొందుతున్న పరమాత్మను దర్శించి ఆశ్రయించుటయే నిజమైన యోగము. అప్పుడే మాయను దాటే శక్తిని పొందిన వారు అవుతారు.
క్షణికమైన ప్రాపంచిక  వస్తు సంపద వైపు అడుగులు వేయక శాశ్వత సచ్చిదానంద పరమాత్మ తత్వమును అలవర్చు కొనుటయే నిజమైన యోగము.
స్వల్ప సుఖములకై ఆశ్రయించి భోగములకై పరుగిడు వాడు పశ్చాతాపముతో జీవితమును వృధా కావించు మూర్ఖులుగా మిగిలి పోతారు. సర్వావస్తలయందు నిజమే మాట్లాడుట సత్య యోగము అపకారికి కూడా ప్రత్యుపకారం  చేయుట అహింసా యోగము. సర్వులయందు క్షమ, ఓర్పు కలిగి ఉండుట దయ యోగము. అసాశ్వితమైన ప్రయోజనాల కోసం వెంపర్లాడక   శాశ్విత మార్గాన్ని అన్వేషించి భగవత్ మార్గం లోకి నడవడమే యోగ ప్రక్రియ.  శాశ్విత పరమ పద సోపానమైన  ఆత్మ పరమాత్మల సంయోగమే  నిజమైన యోగము.
🙏🕉️🙏🕉️🙏🕉️🙏

-దొడ్డపనేని శ్రీ విద్య
విజయవాడ

0/Post a Comment/Comments