దారి చూపు ఈశ్వరా ! --దొడ్డపనేని శ్రీ విద్య

దారి చూపు ఈశ్వరా ! --దొడ్డపనేని శ్రీ విద్య

దారి చూపు ఈశ్వరా !

బతుకు అని పుట్టుక నిచ్చావు
కష్టాల కడలిలో ముంచేసావు
బంధాల తీపి రుచి చూపించావు
ఇదని తెలిసే లోపు
నీ కడకు రప్పిస్తావు కదయ్య ఈశ్వరా !

జీవిత పరిక్షలో గెలిపిస్తావు
జీవించేది పైసలు కోసమే అనిపిస్తావు
అదుపు లేని సంతోషాలిస్తావు
ఎంతటి భాధనైనా
భరించే శక్తి నిచ్చి ఆదుకో ఈశ్వరా!

మనిషి జన్మ నిచ్చావు
పశువులా మారినా కాపు కాస్తావు
అడిగిన వెంటనే వరాలిస్తావు
జన్మ నిచ్చిన నీవు
కర్మని తప్పించి ముక్తి నివ్వవా ఈశ్వరా!

ప్రాణం పోసిన ఈ దేహము నీది
అహం వీడని బంధం నాది 
గాలి బుడగ లాంటి బ్రతుకు మాది
నిరంతర స్మరణ తో
నీ నామం పలికినా కరుణించవేమయ్య ఈశ్వరా !

పుట్టుట గొప్ప కాదు
బ్రతకటం గొప్ప అనేలా
అన్నీ వదలిన నాకు
ఆత్మాభిమానం ఇచ్చి
మాయ చేసావు కదయ్య పరమేశ్వరా!

🕉️🕉️🕉️🕉️🕉️🕉️

దొడ్డపనేని శ్రీ విద్య
విజయవాడ

0/Post a Comment/Comments