ముత్యాల హారం --- పేరు అద్దంకి లక్ష్మి ఊరు ముంబై

ముత్యాల హారం --- పేరు అద్దంకి లక్ష్మి ఊరు ముంబై

తేదీ 25_9-21




ప్రక్రియ ముత్యాలహారం

 రూపకర్త శ్రీ రాథోడ్ శ్రావణ్ గారు

వాడుక భాష యుగకర్త
  అతడు సంఘ సంస్కర్త
  పూర్ణమ్మ సృష్టికర్త
  జన జాగృతి  ప్రవక్త

మనందరికి వెలుగుజాడ
  మార్గదర్శి గురజాడ
 వారి అడుగులజాడ
 సమ సమాజమే చూడ

దేశమును ప్రేమించుమని
  మంచి తనము పెంచమని  
  పరులకై పాటుపడమని  
  దేశభక్తి పెంచుకోమని

మానవతా విలువలను
 సంఘ సంస్కరణలను
 వితంతు వివాహములను
  గురజాడ ప్రోత్సహించెను

కులమత భేదాలను
 ఎన్నొ దురాచారాలను
  బాల్య వివాహాలను
 ఎదిరించి పోరాడెను

చైతన్య బీజము వేసి
  నాటకాల జీవం పొసి
 స్త్రీ లను ఉత్తెజము చేసి
   జాతిని ప్రఖ్యాతి చేసి

చక్కని కథా రచనలు  
 ఉద్యమ సంస్కరణలు
  సామాజిక సందేశములు
  గురజాడ ఆదర్శములు

--పేరు అద్దంకి లక్ష్మీ
     ఊరు ముంబై
     సెల్ నెంబరు
      9 7 5 7 0 4 3 4 6 9

0/Post a Comment/Comments