గురుదేవులు
----------------
కనిపించే దేవుడు
లోకమందున గురువు
నడిపించు నాయకుడు
నీడనిచ్చే తరువు
విజ్ఞాన జ్యోతితో
అజ్ఞానము బాపును
ఎనలేని నీతితో
జీవితాలు దిద్దును
గురువంటే భానుడు
చీకటిని పోగొట్టు
సాటిలేని యోధుడు
గమ్యాన్ని చూపెట్టు
పూజనీయుడు గురువు
సత్యాన్ని బోధించు
భువిలో కల్పతరువు
చేతులను జోడించు
-గద్వాల సోమన్న