ప్రక్రియ: సున్నితం --చంద్రకళ దీకొండ,

ప్రక్రియ: సున్నితం --చంద్రకళ దీకొండ,

ప్రక్రియ:సున్నితం
రూపకర్త:శ్రీమతి నెల్లుట్ల సునీత గారు

1)
ఔషధాల ప్రయోగశాల వంటిల్లు
ఆహారమే ఔషధంగా పనిచేయు
అరిటాకుల్లో భోజనమే శ్రేష్టం
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
2)
పోషకాలను అందుకోలేని శరీరం
వ్యాధులతో శిశువుల బాధలు
పోషకాహారలోపంలో  మూడవస్థానం మనది
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
3)
పిండిపదార్థాలు, మాంసకృత్తులు,క్రొవ్వులు
మోతాదు ఎక్కువైనా తక్కువైనా
తెరిచేను వ్యాధులకు ద్వారమే
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
4)
అధికక్రొవ్వు  అనారోగ్య హేతువు
జంక్ ఫుడ్ తో  జబ్బులకు స్వాగతం
మితాహారమే మేలు మేనికి
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
5)
సమతుల పోషకాల మితాహారంతో 
తగిన శారీరక వ్యాయామంతో
కలుగును దేహానికి పుష్టి
చూడచక్కని తెలుగు సున్నితంబు...!!!

**********************************
చంద్రకళ. దీకొండ,
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా.
చరవాణి:9381361384
 

0/Post a Comment/Comments