శాంతి మంత్రమే గొప్ప తంత్రం(ప్రక్రియ:సున్నితం) -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు.

శాంతి మంత్రమే గొప్ప తంత్రం(ప్రక్రియ:సున్నితం) -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు.

శాంతి మంత్రమే గొప్ప తంత్రం
(ప్రక్రియ:సున్నితం)
---------------------------------------
ఘన విశ్వశాంతి రావాలంటే
మనసులో శాంతి కావాలంటే
శాంతిమంత్రం సదా జపించాలి
చూడచక్కని తెలుగు సున్నితంబు!

స్నేహము గొప్పగ విరియాలంటే
దేశ ప్రగతి సమకూరలంటే
శాంతికిల  అందరూ పూనాలోయ్
చూడచక్కని తెలుగు సున్నితంబు!

అనైక్యత హృదిని పోవాలంటే
దేశ ఐక్యత సాధించాలంటే
శాంతిమంత్రమే గొప్ప తంత్రమోయ్!
చూడచక్కని తెలుగు సున్నితంబు!

మానవ మనుగడ సాగాలంటే
సుఖశాంతులు ధర కురియాలంటే
అందరూ కడు బాగుండాలంటే
చూడచక్కని తెలుగు సున్నితంబు!

నవసమాజం బహు కోరుకుంటే
మాన్యులై ఘనత పొందాలంటే
"శాంతిమంత్రం ఇక గొప్పతంత్రం"
చూడచక్కని తెలుగు సున్నితంబు!
-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు.

0/Post a Comment/Comments