తెలంగాణా వైభవం (పసుమర్తి నాగేశ్వరరావు సాలూరు)

తెలంగాణా వైభవం (పసుమర్తి నాగేశ్వరరావు సాలూరు)


తెలంగాణా వైభవం

ఎన్నో ఉద్యమాల ఫలితం తెలంగాణ ఆవిర్భావం
29వ రాష్ట్రం గా 2014 జూన్ 2న
ఆవిర్భావం
ఎంతోమంది త్యాగజీవుల ఆత్మార్పణ ఫలితం
ఎన్నో ఏళ్ల బంగారు కల ఈ తెలంగాణ

నా తెలంగాణ కోటి రతనాల వీణా
ప్రకృతి అందాలకు అభ్యుదయకవులకు
కళాకారుల కు త్యాగధనుల కు
ఘన చరిత్రకు చారిత్రక కట్టడాలకు ఒక మచ్చుతునక

నల్లబంగారానికి పుట్టినిల్లు సింగరేణి గనులు
గోదావరి కృష్ణమ్మ నదుల పరవళ్లు
చార్మినార్ గోల్కొండ చారిత్రక కట్టడాలు
బిర్లామందిర్ రవీంద్ర హారతి హైటెక్ సిటీల అద్భుత నిర్మాణాలు

ఓరుగల్లు తెలంగాణ తలమానికం
రామప్పదేవాలయం కట్టడి కీర్తిని పెంపొందించెను
వేయిస్తంబాలగుడి తెలంగాణ శిల్పశైలికి తార్కాణం
రామప్ప దేవాలయం లో శివుని ప్రతిమ అద్భుతమైన కళాకాండం


భద్రాద్రి లో వెలసిన రామాలయం
వేములవాడ రాజేశ్వరి ఆలయం
మెదక్ లో ఆసియా లో పెద్ద చర్చి
గోల్కొండ మసీదు ఇవ్వన్నీ తెలంగాణ మతసామరస్యానికి తార్కాణం

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
          టీచర్ సాలూరు
           విజయనగరం జిల్లా

ఇది నా స్వీయారచన. హామి ఇస్తున్నాను

0/Post a Comment/Comments