ఎన్నికల సంస్కరణలు జరుగాలి -మార్గం కృష్ణ మూర్తి

ఎన్నికల సంస్కరణలు జరుగాలి -మార్గం కృష్ణ మూర్తి

- మార్గం కృష్ణ మూర్తి 

ఎన్నికల సంస్కరణలు జరుగాలి

ప్రజా స్వామ్య భారత దేశంలో
ఎన్నికలు ఒక వరం
ఇది మనకు రాజ్యాంగం 
కల్పించినగొప్ప సదవకాశం!
 
సమర్ధ నాయకుల గెలిపించ 
అసమర్ధ నాయకుల ఓడించ
ఎన్నికల ప్రక్రియ దేశంలోనే
వెలకట్టలేని భూమిక!    
 
నేడు  ఎన్నికలు  నాయకుల 
చేతిలో అపహాస్యమాయే
ఓటు ఆయుధం ప్రజల
చేతిలో చిత్తు కాగితమాయె!

మందు పోసి ఓట్లను కొనిరి
డబ్బు పెట్టి నాయకుల కొనిరి
అన్నీ ఉచితాలని  ప్రజలను
వట్టి సోమరులుగా మార్చి వేసిరి!         

ఎన్నికలు జరపామన్నట్లుగా
ఎన్నికలను జరిపిస్తూ , కాలం గడుపుతూ
దేశ సంపదను కొందరే దోస్తూ పోతుండే
ఓటర్లను బిక్ష గాండ్లుగా మారుస్తుండే !

ఓటరులారా! మేధావులారా!
ఇప్పటికైనా కళ్ళు తెరవండి
కుళ్ళు   రాజకీయాలను 
స్వార్ధ నేతలను తరిమి వేయండి!

ఎన్నికల సంస్కరణలు
తక్షణమే జరగాలి
అవినీతి రహిత, సమర్ధత గల 
నాయకులే రాజ్య మేలాలి!

ఒక్కరే రెండూ మూడు చోట్ల
పోటీ చేయ తగదు
చనిపోతే వారసులకు టికటిచ్చి
అసమర్దుల గెలిపించ వలదు!

80 యేళ్ళు నిండిన వృద్ధుడికి
రాజకీయాలేల?
సివిల్, క్రిమినల్ కేసులున్న
వారిని పోటీలో నిలుప నేేల?

అప్పులు చేసిన నేతల
తీర్చే బాధ్యతలను పెంచవలె
అవినీతి నాయకులకు
ఐదేళ్లు టికెట్టు రద్దు చేయవలె!   

నేటి  ఎన్నికల వృధా  ఖర్చుపై, 
విలువైన కాలంపై చర్చించ వలె
జమిలి ఎన్నికలను జరిపించి
వేల కోట్ల ఖర్చు తగ్గించ వలె!
    
-మార్గం కృష్ణ మూర్తి
హైదరాబాద్
0/Post a Comment/Comments