బాలల ముత్యాల హారాలు--గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

బాలల ముత్యాల హారాలు--గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

బాలల ముత్యాల హారాలు

చిన్నారుల లోకము
హృదయాల్లో నాకము
వారి మనసు సమైక్యము
ఉండదు గృహమున శోకము

సదనములో అందము
పరిమళించు సుగంధము
చిన్నారులు భాగ్యము
పటిష్టమైన  బంధము

బాలలుంటే మనుగడ
మధురమైన  చెరుకుగడ
పలుకులేమో మీగడ
దూరమగు ముప్పు ఆమడ

పంచుతారు మోదము
పెంచుతారు తేజము
పసి పిల్లల హృదయము
భగవంతుని ఆలయము

తెల్లని వెన్నెల జల్లులు
చల్లని మనసుల పిల్లలు
ఎల్లరు మెచ్చే మల్లెలు
కల్లలు ఎరుగని పిల్లలు

మింటిలో వెలుగు చుక్కలు
ఇంటిలో ఎదుగు మొక్కలు
మంటిలో అడు బాలలు
కంటిలో కదులు పాపలు

బుద్ధులు విరిసిన కలువలు
సుద్దులు తీయని తేనెలు
ముద్దులు పంచే బాలలు
హద్దులు కాయు సైనికులు

చిన్నారుల ముఖములు
నింగిలో చంద్రికలు
నెమలమ్మ సోయగాలు
పాలకడలి తరంగాలు

- గద్వాల సోమన్న

0/Post a Comment/Comments