🛋️ఉయ్యాల-జంపాల🛋️
ఉయ్యాల-జంపాల
ఇయ్యాల పంపాల
చెప్పవే పసి బాల
విప్పవే నీ కసి గోల
ముద్దుగ ఊగేటి ఉయ్యాల
పొద్దంత సాగేటి జంపాల
పడుకొని మా పాప ఊగాల
మేలుకొని తాను లేవాల
ఊగి ఊగి ఈ ఉయ్యాల
ఆగి ఆగి మా జంపాల
నింగినేలనూ తాకాల
వంగి బేలనూ గోపాల
నింగీ నేలను ఒకటిగా చేస్తూ
ఊగుతుంది మా ఉయ్యాల
చిన్నా పెద్దా అంతా చూస్తూ
సాగుతుంది మా జంపాల
మోజుగ సాగే ఈ జంపాల
రతనాల పగడాల ఉయ్యాల
రివాజుగా ఊపేసి దింపాల
మక్కువతో మేం ఊగేస్తం
చుక్కల లోకం చూసొస్తం
రతనాల పగడాల ఉయ్యాల
రేయనక పగలనక ఊగాల
అదరక బెదరక మేమంతా
ఊగుతూఉంటాం దినమంతా
వజ్రాల వైడూర్యాల జంపాల
వసుధ పై మమ్ము దింపాల
అందరినీ ఊపేసి పంపాలా
దర్శించి హర్శించివారి కొంపల
జోరు జోరుగా ఈ ఉయ్యాల
తీరు తీరుగా మా జంపాల
మైమరచి ఊగుతూ ఉండాల
ఒళ్ళు విరిచి మేం పండాల
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.