దుర్గామాత. (చిట్టి కథ) ---బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి

దుర్గామాత. (చిట్టి కథ) ---బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి

దుర్గామాత (చిట్టి కథ)
------------------------------
సాంప్రదాయ మన దసరా ఉత్సవాల ఈ సందర్భంగా మనం బోధించే దుర్గా మాతకు ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా బాలలు. తెలియకుంటే ఈ కథ చదివి తెలుసుకోండి.
                పూర్వము వేదకాలంలో
"రురుడు"అనే రాక్షసునికి బ్రహ్మదేవుని వరం వల్ల ఒక మిత్రుడు జన్మించాడు. అతని పేరు
"దుర్గముడు"అతను పెరిగి పెద్దవాడై విద్యాబుద్ధులను నేర్చిన తరువాత దైత్య వంశజుల దుర్గతి,
దేవతల మహోన్నత చూసి మదన పడసాగాడు. దేవదానవ లిద్దరూ
 కశ్యప ప్రజాపతికి బిడ్డలై ఉండి
సోదరులైన రాక్షసులను  బాధించి
వదించి వేయగల శక్తి దేవతలకు ఏ విధంగా వచ్చిందని ఆలోచించసాగాడు. దానవ కుల పెద్దలు "దేవతల సర్వ శక్తి కి వేదాలే
కారణమని"దుర్గమునికి చెప్పారు.
         దుర్గముడు వజ్ర సంకల్పంతో అచంచల దీక్షతో చాలా సంవత్సరాలు బ్రహ్మను గూర్చి  తపస్సు చేసి బ్రహ్మ సాక్షాత్కారాన్ని
సాధించాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు బ్రహ్మ."బ్రహ్మదేవా! నీ ముఖం నుండి వెలువడిన, నీ హస్త గతమైన ఆ వేదాలను నాకు ధారాదత్తం చేయాలి. ఎవరూ వేదగానం చేయకూడదు. అందరూ వేదాలను మరచిపోవాలి."అని దుర్గముడు వరం కోరుకున్నాడు. గత్యంతరం లేక బ్రహ్మదేవుడు అనుగ్రహించాడు.
         నాటితో దేవా, బ్రాహ్మణ గణాల లందరికీ వేదాలు గుర్తు రాక యజ్ఞ యాగాలు అన్నీ నిలిచిపోయాయి. దేవతలకు హవిస్సు అందక శక్తిహీనులైపోయారు. నదీనదాలు ఎండిపోయాయి. వర్షాలు లేక వృక్షజాతి క్షీణించి పోయెను. రుషులు, దేవతలు సర్వశక్తి స్వరూపిణి యైన పార్వతీ దేవిని
ప్రార్థించారు. ఆ మహా మాత ప్రత్యక్షమై ఆకలితో అలమటిస్తున్న రుషులందరికీ శక్తివంతమైన శాఖలను (ఆకుకూరలు) ఇచ్చి తినిపించింది. ఆ పాఠాలను తిన్న రుషులు మంచి శక్తి లభించింది. అందరూ పార్వతీ దేవిని శాకాంబరీ దేవి గా వర్ణించి స్తుతించారు. ఆనాటినుండి సాత్వికాహారానికి శాకాహారం అని పేరు వచ్చింది.
        ఆ శక్తి స్వరూపిణి అయిన శాకాంబరీ దేవి దుర్గముడి సంహారానికి నిశ్చయించుకొంది. అప్పుడు ఆమె నుండి కాళిక, భైరవి, శాంభవి, త్రిపుర  మొదలైన శక్తులు 32 మంది పుట్టి దుర్గముడి రాక్షస సైన్యాన్ని సంహరించడానికి బయలుదేరారు. సైన్య నాశనానికి తొమ్మిది రోజులు పట్టింది. శక్తి స్వరూపం తో పార్వతీమాత సింహవాహనాన్ని అధిష్టించి దుర్గముడి పైకి వెళ్ళింది. అచంచల ధైర్యంతో దుర్గముడు ఎదుర్కొన్నాడు. చివరకు శక్తి స్వరూపిణి చేతిలో చంపబడ్డాడు దుర్గముడి వర ప్రభావం పోయి అందరికీ వేద జ్ఞానం పునః లభించింది. దుర్గముడిని విధించిన కారణంగా పార్వతీ దేవికి ఆనాటినుండి "దుర్గామాత"గా పేరు స్థిరపడింది. ఇప్పుడు తెలిసిందిగా బాలలు. సెలవు ఇక ఉంటా. మీ బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి.

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.

0/Post a Comment/Comments