🔐🧷ఇంజనీర్ల దినోత్సవం శుభాకాంక్షలు📐📏

🔐🧷ఇంజనీర్ల దినోత్సవం శుభాకాంక్షలు📐📏

🔐🧷ఇంజనీర్ల దినోత్సవం శుభాకాంక్షలు📐📏

ప్రగతి చక్రాల రథసారథి
మానవాళికి  అనేక సౌఖ్యాలిచ్చిన మేధావి
అహర్నిశలు శ్రమించి కాలినడకకు కొంత విశ్రాంతి నిచ్చె
రెండు చక్రాల సైకిల్ మూడు చక్రాల రిక్షా
బొగ్గుతో నడిచే కార్లు బస్సులు తెచ్చాడు
ఆవిరి శక్తిని గ్రహించి
ఛుక్ ఛుక్ రైలును పట్టాలెక్కించె
పక్షిని చూశాడు విమానాన్నే చేశాడు

పరుగులుతీసే నీటికి అడ్డుకట్ట వేశాడు
ఆనకట్టలు నిర్మించి
పిడికిడంత గుండె శరీరానికి రక్తాన్నిచ్చినట్లు
కాలువలు వేశాడు నేలమ్మను తడిపాడు
రైతన్న గుండెల్లో ఆనందం నింపాడు
పచ్చని పైర్లకు ఆసరాగా నిలిచాడు

తాటియాకులలో వ్రాతలకు పలికే స్వస్తి
పేపరు పెన్ను సిరాలతో 
సమాచార విప్లవం తెచ్చాడు

పావురాలతో కబురంపటం బంద్ అన్నాడు
టెలిఫోన్ టెలిగ్రాం టెలివిజన్
చివరకు అరచేతిలో స్వర్గం అదే సెల్ ఫోన్

భూమాత గర్భాన్ని శోధించాడు
సిరులెల్ల త్రవ్వి ఖనిజాలను తీశాడు
ప్రగతి చక్రాలకు బాసటగా నిలిపాడు

కంప్యూటర్స్ కనిపెట్టాడు
ప్రపంచమంతా ఏకం చేశాడు
పేపరులేని పరిపాలన
ఇంటినుండే ఆఫీసు అన్నాడు

చంద్రమండలం అయితే నాకేంటి అన్నాడు
శబ్దం కంటే వేగంగా పయనించే రాకెట్లను చేశాడు ఏకంగా మనిషినే నడిపించాడు

ఆకాశంలో ఉపగ్రహాలు నడుపుతూ
ప్రసార విప్లవం తెచ్చాడు

మండే సుర్యున్ని చూశాడు సౌర విద్యుత్తు
సృష్టించాడు

ఇల్లు కట్టాలన్నా రోడ్డు వేయాలన్నా సివిల్ ఇంజనీర్ 
మిషన్లు నడవాలంటే మెకానికల్ ఇంజనీర్
విద్యుత్తు కావాలంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్
ఖనిజాలు తీయాలంటే మైనింగ్ ఇంజినీర్

ఇలా ఎలెక్ట్రానిక్స్, ఏరోనాటికల్, కమ్యూనికేషన్, కెమికల్, మెరైన్, ఆడియో ఇంజనీరింగ్ లాంటి ఎన్నో విభాగాలు

బోల్టు బిగించాలంటే నట్ కావాలి
మన మనుగడ నడవాలంటే ఇంజనీర్ కావాలి

అనుదినం పరిశోధనలు
తన తపన ఆగదు ఏ నిమిషమూ
గ్రహాంతరనివాసం మనిషి లాంటి రోబోలు
చివరకు సృష్టికి ప్రతిసృష్టి చేయనిదే
విశ్రమించడు ఈ శ్రమజీవి

ఇంజినీర్ల దినోత్సవం నేడు
ఎందరెందరో ప్రముఖులు
మోక్షగుండం విశ్వేశ్వరయ్య
జయంతి ఇంజనీర్స్ దినం అన్నారు
ఇంకా ఎందరో ఇంజనీర్లు
అందరినీ పేరు పేరునా స్మరిద్దాం

.......✍️
డా విడి రాజగోపాల్
9505690690 

0/Post a Comment/Comments