చరవాణి(పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

చరవాణి(పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

చరవాణి

వాణి కాదు నేటి చరవాణి
వదలదు నువ్వు అవునన్నా కాదన్నా
వాణి అని మురిసిపోకు చరవాణి
వదలమన్నా నిను వదలదు కన్నా

మధురవాణి అని మురిసి పోవద్దు
తెలియకుండా పోతుంది నీకు ఏ పొద్దు
మధురమైన చరవాణియేయని తెలుసుకో ఈపొద్దు
తెలియకుంటే నీకు ఉండదు ఏ పొద్దు

ఉదయాన్నే నిను లేపుతుంది మంచిపిలుపుతో
తోస్తుంది నిను ఆ ఊబిలోకి
ఉదయం నుండి ఉంచుతుంది మురిపెం తో
తొలిపొద్దు తెలియని తన లోకానికి

రంగురంగుల హంగులు కల చిన్నది
మేలి ముసుగులో మెసేజ్లు పంపుతుంది
రకరకాలుగా మనకు ఆకర్షణ చూపుతుంది
మెరుపులు కురిపిస్తూ మైమరిపిస్తూ కవ్విస్తుంది

బంధం కానీ బంధంతో మురిపిస్తుంది
అన్నీ తనే అని అనిపిస్తుంది
బంధం పెనవేసుకుని వదలనని ఉంటుంది
అన్నీ వదిలేటట్లు మనల్ని చేయిస్తుంది

ప్రపంచాన్నే దాసోహం చేసుకున్న చరవాణి
చేతిలో లేనిదే పని జరగదు
ప్రపంచమంతటిని తిప్పుకున్న ఈ మధురవాణి 
చేతికి పని చెప్పక ఉండదు

అర్ధం అదే పరమార్థం అదే
యుక్తి కలది కుయుక్తి గలది
అందలం ఎక్కించేది తోసేది అదే
యుక్తినెరిగినవాడే దానినుండి  బయట పడగలిగినది

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
          టీచర్ సాలూరు
           విజయనగరం జిల్లా
            944150829


0/Post a Comment/Comments