వివిధ రకాల ధర్మాలు -ఉమ శేషారావు పంతులు లింగాపూర్, కామారెడ్డి

వివిధ రకాల ధర్మాలు -ఉమ శేషారావు పంతులు లింగాపూర్, కామారెడ్డి
"ధర్మం" అంటే ఏమిటి? 
       
అగ్ని సాక్షిగా పెండ్లాడిన భార్యను 
    వదిలి వేయకుండా వుండటం:
         *వివాహ ధర్మం!* 

తన భర్త అందహీనుడైనా, స్థితిపరుడు కాకున్నా, 
      నమ్మివుండటం:
            *భార్య ధర్మం!* 

నమ్మిన మిత్రునికి అపకారం 
     చేయకుండటం :
           *మిత్ర ధర్మం!* 

సోమరితనం లేకుండటం:
          *పురుష ధర్మం!* 

విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించటం:
             *గురుధర్మం!* 

భయభక్తులతో విద్యను నేర్చుకోవటం:
             *శిష్యధర్మం!* 

న్యాయమార్గంగా సంపాదించి 
     సంసారాన్ని పోషించటం:
          *యజమాని ధర్మం!* 

భర్త సంపాదనను సక్రమంగా పెట్టి 
     గృహాన్ని నడపటం:
            *ఇల్లాలి ధర్మం!* 

సైనికుడుగా వుండి దేశాన్ని,ప్రజలను 
      కాపాడటం:
            *సైనిక ధర్మం!* 

వృద్ధులైన తల్లిదండ్రుల్ని ఆదరించి 
      పోషించటం:
               *బిడ్డల ధర్మం!* 

తాను జన్మనిచ్చిన బిడ్డల్ని ప్రయోజకుల్ని 
     చేయటం :
              *తండ్రి ధర్మం!* 

తన ఇంటికీ, తనను కన్నవారికీ పేరు 
     ప్రతిష్ఠలు తేవటం:
          *బిడ్డలందరి ధర్మం!* 

తన వృత్తి ఎటువంటిదైనా వృత్తిని 
    గౌరవించటం :
             *వృత్తి  ధర్మం!* 

 తీసుకున్న జీతానికి నమ్మకంగా పని చేయడం  
                *ఉద్యోగి ధర్మం*

తాను సంపాదించిన దాన్ని తనవారితో 
    పంచుకొని తినటం :
             *సంసార ధర్మం!* 

అసహాయులను కాపాడటం:
           *మానవతా ధర్మం!*

 చెప్పిన మాటను నిలుపుకోవటం :
               *సత్య ధర్మం*
              
                 
   ఉమ శేషారావు పంతులు
   లింగాపూర్, కామారెడ్డి0/Post a Comment/Comments