ప్రక్రియ:సున్నితం
రూపకర్త:శ్రీమతి నెల్లుట్ల సునీత గారు
మాయమాటల వలలో చిక్కి
మోహావేశాల ప్రభావానికి లొంగి
ప్రే"మించి"నవాడి చేతిలో హతులు
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
మద్యపానపు మత్తుకు బానిసలై
మాదకద్రవ్యాల గమ్మత్తుకు దాసులై
మహిళలను చెరబడుతున్న కామాంధులు
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
మాయామర్మాలు తెలియని పసికూనలైనా
వణుకుతున్న వడల ముదుసలులైనా
ఉన్మాదుల కామాగ్నిలో సమిధలై
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
నియంత్రణ లేని మాధ్యమాలు
మాగన్ను నిద్రలో ప్రభుత్వాలు
భద్రతారాహిత్యంతో బాలికల భవిష్యత్తు
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
అశ్లీలచిత్రాలను సత్వరమే నిషేధించాలి
మ్లేచ్చుల మేహనం ఖండించాలి
అబలల ఆత్మగౌరవం కాపాడాలి
చూడచక్కని తెలుగు సున్నితంబు...!!!
****************************************
చంద్రకళ దీకొండ,
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా.
చరవాణి:9381361384