ఎంతో అందము-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

ఎంతో అందము-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

ఎంతో అందము
------------------------
చెట్టుకు ఆకులు
నింగికి చుక్కలు
పచ్చని మొక్కలు
ఎంతో అందము

మోముకు నగవులు
వనమున సుమములు
పొలమున మొలకలు
ఎంతో అందము

కొలనున కలువలు
నైతిక విలువలు
తనువుకు వలువలు
ఎంతో అందము

విరిసిన మల్లెలు
తొలకరి జల్లులు
ఇంటికి పిల్లలు
ఎంతో అందము

--గద్వాల సోమన్న 

0/Post a Comment/Comments