మంచితనం ఒక మంచి గంధం..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

మంచితనం ఒక మంచి గంధం..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

మంచితనం ఒక మంచి గంధం..!

మంచితనం మనస్సులో నుండి పుడుతుంది..!
మరోపేరు మానవత్వంగా ఎంచబడుతుంది..!

సాటి మనిషి పట్ల సానుభూతి 
కురిపించడంలో మంచి మనస్సు ప్రాధాన్యతగా ఎంచబడుతుంది..!

ఎన్ని రకాల సమస్యలున్నా..మంచితనం 
మదిలో నుండి తొలగిపోవడం అంటూ జరగదు..!

కేవలం కరుణ,దయ..ఇత్యాదిని తనలో నింపుకుని వర్ధిల్లేది..మంచితనం..!
వాస్తవానికి "దేవుడు" అనేవాడు మంచి కార్యాలు మాత్రమే చేయమని హిత బోధ చేస్తున్నాడు..!

మంచితనం ఒక మంచి గంధం లాంటిది..!
లోకంలో చాలా మంది చెడ్డ కార్యాలకు ఆకర్షితులు అవుతున్నారు..! 
కాని మంచితనం ఒక్కటే చిరస్థాయిగా నిలిచేది..!

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments