విఘ్నేశ్వరునికి చిరువిన్నపం...పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

విఘ్నేశ్వరునికి చిరువిన్నపం...పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

విఘ్నేశ్వరునికి చిరువిన్నపం..

ఓ ప్రియమైన భక్తాగ్రేసరులారా !

ఆ వరసిద్ధి వినాయకుడు
మీ "కష్టాలకడగండ్లను" తనతొండంతో తొలిగించి
"బాధల సుడిగుండాల" నుండి పైకి మిమ్ము రప్పించును గాక !
"ఆపదల అగ్నినుండి" మీ అందరినీ తప్పించును గాక !

మిమ్ము చుట్టుముట్టే బుసలు కొట్టే
కౄరమైన "సమస్యల సర్పాలన్నింటిని" తన తండ్రి
శివయ్య మెడలో "పూలహారాలుగా" వేయును గాక !

తన తల్లి పార్వతి ఇచ్చే "వరాలమూటలను" తెచ్చి
పసందైన "విజయాలవిందును" మీకు అందించును గాక !

మీరు తలపెట్టిన సమస్త కార్యాలలో ఎదురయ్యే "విషపురుగుల విఘ్నాలను" "చింతలచీకట్లను" చీల్చివేసి
మీ జీవితాల్లో "వెన్నెలవెలుగుల్ని" నిండుగా నింపును గాక !

సకలశుభాలు,అష్టైశ్వర్యాలు,ఆరోగ్యసౌభాగ్యాలను
"కోటివరాలను" సమృద్ధిగా మీపై కుమ్మరించును గాక !

ఆ వరసిద్ది వినాయకుని కరుణా కటాక్ష
వీక్షణాలు సదాకాలం మీకు, మీ కుటుంబసభ్యులకు
తోడుగా, నీడగా, కొండంత అండగా, ఉండును గాక !
"ప్రశాంతమైన జీవితాన్ని" నేడే మీకు ప్రసాదించును గాక !

మనోహరమైప మంగళకరమైన
శుభకరమైన ఈ శుభదినాన
ఆ బొజ్జగణపయ్య పాదపద్మాల చెంత ప్రణమిల్లి...
శిరసును వంచి...ముఖిలిత హస్తాలతో ...అర్థిస్తున్నా... మీకు అంతా మంచే జరగాలని మనసారా ప్రార్థిస్తున్నా....
అందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలతో.......

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్
 

0/Post a Comment/Comments