గుర్రాల ముత్యాల హారాలు --బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ జిల్లా.

గుర్రాల ముత్యాల హారాలు --బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ జిల్లా.

గుర్రాల ముత్యాల హారాలు తే.22-8-21.
771) మంచినీళ్లు ఇవ్వరా
         ఎగురుతుంది గువ్వరా
          సురేఖ నవ్వేను రా
           నువ్విక ఇలా రా రా !

772) బంజారా పేపరు అది
         ఆపరా నీవు సోది
          చదువురా నీవు ఇది
          ఈ నాడే రా ఉగాది !

773) చక్కని చుక్క రావమ్మ
          జక్కన్న  వచ్చాడమ్మ
          అతనికి వచ్చే సొమ్మ
           చూసేను సూరమ్మ!

774) వచ్చాడు కళ్యాణ రాముడు
         వాడు ఆమె తనయుడు
        అందరికి పరిచయస్తుడు
         వస్తూ పోతూ ఉంటాడు !

775) అది నా బంగారు పన్ను
          ఇదిగోరా నీ పెన్ను
          కొట్టుకుంటుంది కన్ను
           పట్టుకరా ఇక గన్ను 

776) ఇందా మకరందం
         అబ్బా ఏమి అందం
         చూడరా అరవిందం
           అంతా కలిసి తిందం !

777) ఎం డల్ గా ఉన్నావు
         నేనే మాడల్ అన్నావు
         ఇంకా ఏమి తిన్నావు
         ఆగు వెళ్ళిపోతున్నావు !

778) అరుస్తుంది పిల్లి కూన
          పెట్టారా దానికి దాన
           రావే ఓ చిన్నదాన
            నీవు చెందకు వేదన !

779) చిలక కొరికిన పండు
          ఎంతో తీయగా ఉండు
         తిని  చూడరా పండు
         అది మధురముగా ఉండు !

780) కళ్ళు మూసుకుపోయాయి 
        చూపులు కలుసుకున్నాయి
        మనసులు మురిసినాయి
        తనువులు కలిసినాయి !

781) అది చిలక పచ్చని చీరా
         నే నచ్చలేదు పోరా
          ఎందుకు  తెచ్చారురా
          తిరిగి ఇచ్చేసి రండిరా !

782) ఇది పున్నమి రేయిగా
          ఇంకేమి హాయిగా
           ఈ రేయి ఎంత తీయగా
            మారిపోయానుగా !

783) నూతిలోని కప్పలు
         పగిలినాయి కప్పులు
          మిగిలినాయి తిప్పలు
          తొడుగుకొనిరా చెప్పులు !

784) అది రసాయన శాస్త్రం
         ధరించు కొత్త వస్త్రం
        ఇది పదునైన అస్త్రం
          చదువుతావు ఏ శాస్త్రం !
         
    785) పట్టుకో పనిముట్టు
              కీ బోర్డు లు కొట్టు
               పలు చిత్రాలను పెట్టు
               వాటిని నెట్లో పెట్టు      !

786) పల్లెటూరు పిల్లగాడు
         పశువుల కాయువాడు
         పట్నానికి వస్తున్నాడు
         పనికై చూస్తున్నాడు !

787) నే కాలేజి పోరన్ని
        జోరై ఉన్నవాన్ని
          ఎదుగుతున్న వాన్ని
          పోరు చేసే వాన్ని !

788) ఓడిపోకు ఆటలో
         ఆగిపోకు బాటలో
          సాగు నీవు వేటలో
         అడుగు పెట్టు కోటలో !

889) దారి లోనే ఉండు
         తాగుతూనే ఉండు
          వస్తుందేమో దండు
          నీవు చూస్తూ ఉండు !

790) ముక్కుసూటి మనిషండి
         ఉక్కు లాంటి మనిషండి
          మాట తప్పనోడండి
          మాటకు పడిచస్తడండి !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments