ఈనాటి బంధం ఏనాటిదో ---పసుమర్తి నాగేశ్వరరావు

ఈనాటి బంధం ఏనాటిదో ---పసుమర్తి నాగేశ్వరరావు

ఈనాటి బంధం ఏనాటిదో

అక్కరకు రాని బంధం
అందుకోలేని బంధం
అందమైన బంధం
అందలం లో ఉన్న బంధం

గగనం లో లేవు
గగన కుసుమం కావు
గగనమవుతున్నావు
గగనమే అనిపిస్తున్నావు

ఏనాటి బంధమో
ఏనాటి అనుబంధమో
ఏనాటి సంబంధమో
ఈనాటి మన బంధం

కానిదని తెలిసినా
కాకూడనిదని తెలిసిన
కావాలనిపిస్తున్నా
కాదనాలనిపించడం లేదు

తలచుకుంటూ
తపించుకుంటూ
తపనపడుతూ
తప్పు చేయరాదని

తహతహలాడుతున్న మనసుని
సద్దిచెప్పుకుంటు సరిచేసుకుంటు
సవ్యంగా ఉంచాలని
సవ్యంగా ఉండాలని

నా మనసుని కోరుతున్న
నన్ను నేను అణచుకుంటున్న
నాది కాదని దూరం గా వుంటున్నా
కానీ దగ్గరవ్వాలనే ఆ మనసుని

దూరం చేస్తున్నా
దూరంగా ఉంచుతున్నా
అయినా చేరువవుతూనే ఉంది
ఈనాటి బంధం ఏనాటిదో

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
           సాలూరు
           విజయనగరం జిల్లా


0/Post a Comment/Comments