'గురుభ్యోనమః
లోకం తెలియని పసివాడైనా
లోకాలేలే పైవాడైనా... గురువుకి శిష్యులే!..
గురువంటే ఙ్ఞానాన్ని అందించే బ్రహ్మ..
క్రమశిక్షణ నేర్పించే దండం..
నిత్య చైతన్య వేకువ సుప్రభాత గీతం..
తిమిర సంహార తేజోమయ కాంతి కిరణం..
విజ్ఞాన గుప్త దాత..సన్మార్గ స్ఫూర్తి..హిమోదయ జగద్విదిత..
సమాజాన్ని తీర్చిదిద్దే బాధ్యత..
ప్రపంచ భవిష్యత్తుకు మార్గ దర్శకం..
యువతను ఉత్తమమైన వ్యక్తులుగా
తీర్చిదిద్దే అపర శిల్పి..
సాక్షాత్తు దేవుడైనా తలవంచి మొక్కే దైవం..
ప్రతి ఒక్కరు ఆజన్మాంతం మదిలో నిలుపుకోవలసిన దివ్య మంగళ స్వరూపం.!!
---సుజాత.పి.వి.ఎల్,
సైనిక్ పురి, సికిందరాబాద్.