మా చైతన్య భారతి. బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర్ కర్నూలు జిల్లా .

మా చైతన్య భారతి. బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర్ కర్నూలు జిల్లా .

మా చైతన్య భారతి
--------------------------
మా చైతన్య భారతి
ఇలా అపర సరస్వతి
అందుకో మా హారతి
ఇక నీవేగా మా గతి !

సహకారం అందిస్తుంది
సహనంతో ఉంటుంది
సారీ అని అంటుంది
తాను చెప్పింది వింటుంది !

మమకారం పంచుతుంది
సహ కారం అందిస్తుంది
అన్నవరం చూపిస్తుంది
కన్నతల్లి అనిపిస్తుంది !

మమ్ము సదా దీవిస్తుంది
మా క్షేమం కోరుతుంది
తన వారని అంటుంది
కలుపుగోలుగ ఉంటుంది !

మానవత్వం మానసి
ప్రేమతత్వం తులసి
తాను కలసి మెలసి
నివసించే నివాసి. !

ఆమె వ్రాసిన కథలు
తెలుపు మన వెతలు
అందులోన చురకలు
కావులే గడ్డిపరకలు. !

పొందుగ వ్రాయు కవితలు
అందులో ఎన్నో నీతులు
బంధించే సద్గతులు
సంధించే శరదృతులు !

రాస్తుంది లే గీతాలు
వేస్తుంది లే వాతలు
అవి మన హితాలు
అని చెప్పిరి శ్రోతలు !

వ్రాసె ముత్యాలహారాలు
తెరిచే కవిత ద్వారాలు
పంపెను ఆహ్వానాలు
చేసెను సన్మానాలు !

ఆదర్శమైన గృహిణి
సద్గుణాల శుభ వాణి
మా పాలిటి దివ్యవాణి
తెలుగు వెలుగుల శ్రీవాణి !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.

0/Post a Comment/Comments