విశ్వ శాంతి సంరక్షణ --దొడ్డపనేని శ్రీ విద్య

విశ్వ శాంతి సంరక్షణ --దొడ్డపనేని శ్రీ విద్య

విశ్వ శాంతి సంరక్షణ

శాంతియుత దృక్పధం

హింస లేని సమాజాన్ని చూడటం కోసం
ప్రజల జీవనం ఐకమత్యం గా ఉండటం కోసం

యుద్ధ రహిత సమాజ స్థాపన కోసం
ప్రపంచ దేశాల మధ్య సత్సంబంధాల కోసం

మానవ జీవితాలలో సోదర భావం పెంపొందటం కోసం
విశ్వ మానవాళికి శాంతి స్పూర్తి నివ్వటం కోసం

సహనమే మన నిత్య ఆభరణం
విశ్వశాంతి యే మన తక్షణ సందేశం

కులమతాలు వేరయినా మనందరిదీ మానవత్వ గుణం
శాంతియుత దృక్పథమే సాధించే ఆశయం

సత్యం, ప్రేమయే మన ఆయుధం
ప్రపంచ శాంతి మనగడకు అదియే ఓ వరం

శాంతి తోనే మనిషి లోని మృగాన్ని అంతం చేయగలం
అందుకు ఎదుటి వారిని క్షమించే గుణం అవసరం

సమాజానికి నిర్దేశిత సందేశం ఇవ్వటం కోసం
మనుషులంతా సమానమనే భావం అత్యవసరం

మహోన్నతులు చెప్పిన ఆశయ బాటలో నడవటం
గాంధీగారు చూపిన అహింసా మార్గమే శరణ్యం

అంతర్జాతీయ సంస్థలు విభేదాలు లేకుండా ఉండటం
నిరంతర కృషి తోనే సాధించగలం లక్ష్యం

సమ సమాజ స్థాపన తో మానవ జీవితాలు సుఖమయం
విశ్వ శాంతి స్థాపన ఒక్కటే జన జీవనానికి ఓ వరం

దొడ్డపనేని శ్రీ విద్య
విజయవాడ
18/09/2021
శనివారం

0/Post a Comment/Comments