మహిళా మహంకాళి (ఆడది ఆదిశక్తి). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి.

మహిళా మహంకాళి (ఆడది ఆదిశక్తి). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి.

మహిళమహంకాళి (ఆడది ఆదిశక్తి)

మానవత్వాన్ని మంటగలిపిన
మదన తాపంతో మత్తెక్కిన
మానవ దానవ మృగాలు కైపెక్కిన
కళ్ళతో మహిళల వైపు చూస్తూ వెకిలి వెర్రి మొర్రి చేస్టలు చేస్తూ
వారిని వేధిస్తున్నరు బాధిస్తున్నరు!

ప్రేమిస్తే సరేసరి లేకుంటే ఉరే ఉరి
వేస్తం మీ అంతుచూస్తాం అంటూ
మహిళల బెదిరిస్తున్నరు అది రిస్తున్నరు వారి ప్రాణాలను తోడేస్తున్నరు తాడేస్తున్నరు
వారి ముందు తైతక్కలాడేస్తున్నరు!

మదమెక్కిన ఈ ఎనుబోతుల
కండకావరంను కరిగించేవారే లేరా?
గుణ పాఠం నేర్పే తీరే కన రాధా?
మహిళలకు రక్షణ కల్పించే న్యాయవ్యవస్థ ఉన్న దాన్ని నమ్ముకున్న మృగతృష్ణే గదన్న!

ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకండి మీరు
మహిళలూ మీరు మహంకాళికలు
ఏలికలై మీ శక్తిని వారికి చూపెట్టండి
 ఆడవారంకాంమేంఆదిశక్తులం మని నిరూపించుకోండి నిరోధించి
మీ విజయశిఖరం అధిరోహించండి 

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా
.

0/Post a Comment/Comments