మణి పూసలు--
దాశరథి
*******
కలమును ఎక్కుపెట్టెను
గళమును విప్పిపాడెను
రాచరికము నణచివేసి
రైతును రాజు చేసెను!
వారి మాటలు తూటాలు
అనన్యా సామాన్యాలు
ఆంగ్లేయుల గుండెల్లో
పదునైనట్టి గునపాలు!
సింహ కవిగను మారెను
సింహ గర్జన చేసెను
అగ్నిధారకురిపించగ
ఆయుధంగామలచెను!
సమర శంఖమెఊదెను
సాహితీ జగతందును
రుద్ర వీణతో రుద్రుడై
దాస్య విముక్తి కోరెను!
అభ్యుదయపు కవియితడు
కళా ప్రపూర్ణుడీతడు
నిజాంరాజు పాలనపై
సంధించు బాణమితడు!
జైలు గోడపై రాసెను
బొగ్గుతోటిపద్యాలను
నిగ్గదీయు రాతలుగ
నిప్పు కణికలైరాలెను!
దాస్య విముక్తినికోరి
జైలు గోడలనుచేరి
తనపద్యమె ఆయుధంగ
చూపెను చైతన్యదారి!
గాన యోగ్య మైనవిగ
మదిని గెలిచినట్టివిగ
గాలిబ్ గీతములతోడ
ఘన కీర్తిని పొందెనుగ!
ప్రజా కవిగ దాశరథి
ఉద్యమా రథసారథి
తిమిరంతో సమరాన
వెలుగు నింపేదళపతి!
కవుల నాదరించెతాను
కదిలినాడుతనకుతాను
(ఆంధ్ర)సారస్వత పరిషత్తుకు
స్థాపకుడై వెలిగెతాను!
✍🏻వల్లంభట్ల వనజ
అదిలాబాద్